4 June, 2026 | 5:19 PM

నాగోబా సన్నిధిలో ఎక్సలెన్సీ పాఠశాల ప్రారంభం

04-06-2026 04:29 PM

ఉట్నూర్, జూన్ 4 (విజయక్రాంతి): ఆదివాసులు ఆరాధ్య  దేవుడు నాగోబా సన్నిధిలో  నాగోబా ఎక్సలెన్సీ  పాఠశాలను గురువారం ప్రారంభించారు. ఈ విద్యా సంవత్సరం నుండి  పేద విద్యార్థులకు నాగోబా ఎక్సలెన్సీ పాఠశాలలో  విద్యా బోధన  ను ప్రారంభిస్తున్నట్లు  మెస్రం వంశం ఉద్యోగుల సంఘం బాధ్యులు ప్రకటించారు. పాఠశాల ప్రారంభించిన అనంతరం  పాఠశాల ప్రధానోపాధ్యాయుడుగా  మెస్రం  రాజును ఉద్యోగ సంఘం   అధ్యక్షుడు మెస్రం సోనేరావు, ప్రధాన కార్యదర్శి మెస్రం దేవరావు, ఉట్నూర్ బీఈడీ కాలేజ్  విశ్రాంత ప్రిన్సిపాల్ మెస్రం మనోహర్, సంఘం నాయకుడు మెస్రం శేఖర్ బాబు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తల్లిదండ్రి లేని పిల్లలను సైతం ఈ పాఠశాలలో చేర్పించి  వారిని విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు  తమ వంతు కృషి చేస్తామని  అన్నారు. ఆదివాసి గిరిజనులు చదువు పట్ల  ముందుకు తీసుకు వెళ్ళేందుకు  ఈ నిర్ణయం తీసుకున్నామని  వారు తెలిపారు.