4 April, 2026 | 2:48 AM

పోలీస్ డ్యూటీ మీట్‌లో ద్వితీయ స్థానం దక్కించుకున్న తెలంగాణ ఫొటోగ్రాఫర్స్ టీమ్

04-04-2026 01:08 AM

ప్రతిభ చాటిన వరంగల్ 

పిఆర్‌ఓ మోహనకృష్ణ

వరంగల్, ఏప్రిల్ 3 (విజయక్రాంతి): మహారాష్ట్రలోని నాగ్ పూర్ నగరంలో మార్చ్ 29 నుండి ప్రారంభమైన జాతీయ స్థాయి పోలీస్ డ్యూటీ మీట్ లో తెలంగాణ పోలీస్ ఫోటో గ్రాఫర్స్ టీం రెండవ స్థానంలో నిలిచి రన్నరప్ ట్రోఫీని కైవసం చేసుకున్నారు.

ఈ సందర్బంగా ఈ పోటీలకు సంబంధించి శుక్రవారం రాత్రి నాగ్ పూర్ పోలీస్ శిక్షణ కేంద్రంలో జరిగిన ముగింపు వేడుకల్లో కేంద్ర హోం శాఖ సహాయ శాఖ మంత్రి ని త్యానంద రాయ్ చేతుల మీదుగా మోహన కృష్ణ, కోచ్ జయరాజ్, కానిస్టేబుల్ రాజశేఖర్ తో కలసి ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ రన్న రప్ ట్రోఫీని అందుకున్నారు.ఈ సందర్బం గా ఈ పోటీల్లో రాణించిన వరంగల్ నగర పోలీస్ కమిషనరేట్ పిఆర్‌ఓ గా విధులు నిర్వహిస్తున్న మోహన కృష్ణ ను వరంగల్ పోలీస్ కమిషనర్ తో పాటు ఇతర పోలీసు ఉన్నతాధికారులు ఇతర పోలీస్ సిబ్బంది అభినందించారు.