calender_icon.png 30 September, 2025 | 3:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ ఆత్మగౌరవ పండుగ.. బతుకమ్మ

30-09-2025 02:43:54 AM

రాష్ట్ర ప్రజలకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు 

హైదరాబాద్, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ పం డుగ.. బతుకమ్మ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతి, అస్తిత్వానికి ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ర్ట ప్రజలు, ముఖ్యంగా ఆడబిడ్డలకు ఒక ప్రకటనలో ఆయన శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ నారీలోకం తొమ్మిది రోజుల పాటు ఉత్సాహంగా, భక్తిశ్రద్ధలతో ప్రకృతిని పూజిస్తూ, ఆటపాటలతో జరుపుకున్న ఈ పండుగ ప్రతి ఇంటా సంతోషాన్ని, సిరిసంపదలను తీసుకురావాలని కేటీఆర్ ఆకాంక్షించారు. ప్రతి ఆడపడుచు ఆనందంగా ఉండాలని బతుకమ్మ తల్లిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.