2 June, 2026 | 9:30 PM

ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

02-06-2026 08:27 PM

మణుగూరు,(విజయక్రాంతి): మండలంలో మంగళవారం 13వ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామపంచాయ తీలు, విద్యాసంస్థలలో జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించి రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపు కున్నారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ప్రజాభవన్ లో శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు జాతీయ జెండా ఆవిష్కరించి మాట్లాడారు. బిఆర్ఎస్ పార్టీ కార్యా లయంలో ఆ పార్టీ భద్రాద్రి జిల్లా ఇన్చార్జి  రేగా కాంతారావు  జాతీయ జెండాను ఆవిష్కరించి అమరవీరుల త్యాగాలను గుర్తు చేశారు. సిపిఐ కార్యాలయంలో మంగి వీరయ్య, అలాగే  కోర్టు ప్రాంగణంలో సూపరిండెంట్ దీకొండ రవికుమార్ వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏఈఓ లక్ష్మణ రావు  జెండా ఆవిష్కరణ కార్యక్ర మాలలో పాల్గొన్నారు. ఈ వేడుకలలో అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పక్షాల నాయకులు పాల్గొన్నా రు.