2 September, 2026 | 4:02 PM

బీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణ తల్లి బందీ

10-12-2024 | 01:28am

ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి 

హైదరాబాద్, డిసెంబర్ 9 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ పాలనలో తెలంగా ణ తల్లి బందీగా మా రిందని, అందుకే కొత్తగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. బహుజనులకు ప్రతిరూపంగా విగ్రహా న్ని రూపొందించామని, దీనిపై రాద్ధాం తం చేయడం మానుకోవాలన్నారు.

అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద సో మవారం ఆయన మాట్లాడుతూ.. తమ తప్పులు బయటపడతాయనే భయం తో బీఆర్‌ఎస్ సభ్యులు సభలోకి రాకుం డా నిరసన పేరుతో తప్పించుకున్నారని ఎద్దేవా చేశారు. సభలోకి వచ్చి తెలంగాణ తల్లి విగ్రహంపై మాట్లాడితే వారికి గౌరవం ఉండేదన్నారు. ఎన్నికల్లో ప్రజ లు బుద్ధి చెప్పినా మారకపోవడం వారి అహంకారానికి పరాకాష్ట అని అన్నారు.