4 May, 2026 | 4:02 PM

Breaking News

చరిత్ర సృష్టించిన విజయ్.. దళపతి ప్రస్థానం ఇదే..!   •   మంత్రి శ్రీధర్ బాబుకు శ్రీ రేణుక ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్టాపన ఆహ్వానం   •   డంపింగ్ యార్డును తరలించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి   •   సీసీ రోడ్డు పనులకు భూమిపూజ చేసిన మేయర్   •   అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం స్థలం కేటాయించాలంటూ తాసిల్దార్ కు వినతి   •   తల్లి ఏడవకండి.. మా ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది   •   ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకే చలివేంద్రం   •   కేరళం హస్తగతం.. యూడీఎఫ్ ఆధిక్యం   •   మాది రైతు ప్రభుత్వం భరోసా లేని రైతు జీవితానికి భరోసా కల్పిస్తాం: విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్   •   ఇంకా ఓడిపోయినట్లు కాదు.. ఎన్నికల ఫలితాలపై మమతా బెనర్జీ స్పందన   •  

పైసలిస్తనే పని!

10-12-2024 01:31 AM

* నిర్మల్ జిల్లాలో అవినీతి అధికారులు

* వరుసగా ఏసీబీకి చిక్కుతున్నా మారని తీరు

* ఏడాదిలో 20 కేసులు, 16 మంది అరెస్టు

నిర్మల్, డిసెంబర్ 9 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలోని ప్రభుత్వ అధికారులపై అవినీతి ఆరోపణలు ఎక్కువగా వస్తున్నాయి. ఇటీవల కాలంలో కొందరు అధికారులు వరుసగా ఏసీబీకి పట్టుబడుతున్నా.. మిగిలిన అధికారుల్లో మాత్రం మార్పు రావడం లేదని తెలుస్తున్నది. డబ్బు సంపాదనపై ఆశలు పెంచుకుని ఏసీబీకి పట్టుబడుతూ ప్రశాంతంగా ఉన్న జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

కొందరు అధికారులు ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలు ఏ పనికి వచ్చినా మాముళ్లు ఇస్తేనే ఫైల్ ముందుకు తీసుకెళ్తున్నారనే ఆరోపణలున్నాయి. పనిని బట్టి పైసలు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తున్నది. నిర్మల్ జిల్లాలో ఒక్క ఏడాది కాలంలో 12 కేసులు నమోదుకాగా 16 మంది అధికారులు ఏసీబీకి చిక్కారు. అందులో జిల్లాస్థాయి అధికారులు కూడా ఉండటం గమనార్హం. దీన్నిబట్టి జిల్లాలో ఏ విధంగా అధికారులు అవినీతికి పాల్పడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. 

ఈ శాఖల్లోనే ఎక్కువ?

ముఖ్యంగా లావాదేవిలు ఎక్కువగా నిర్వహించే సబ్ రిజిస్ట్రార్, రవాణ శాఖ, రెవె న్యూ, పోలీస్, ల్యాండ్ రికార్డు సర్వే, మున్సిపల్, విద్యశాఖ, ఎక్సెజ్, మార్కెటింగ్, వాణి జ్య పన్నులు శాఖల కార్యాలయాల్లో ఎక్కువగా అవినీతి జరుగుతున్నట్లు తెలుస్తున్నది. అధికారులు తమ స్థాయి, ప్రజల అవసరా లు, పనిని బట్టి లంచం డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. 

ఇటీవల నమోదైన కేసులు

ఒక్క ఆరు నెలల్లోనే మున్సిపల్‌లో మూడు కేసులు నమోదయ్యాయి. రెవెన్యూ శాఖలో ముగ్గురు ఉద్యోగులు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. వీరిలో జిల్లా స్థాయి అధికారులు కేవలం రూ.పది వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. అంతకుముందు నిర్మల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాల యంలో రూ.8 వేలు లంచం తీసుకుంటూ ఇద్దరు అధికారులు దొరికారు. 15 రోజుల క్రితం ల్యాండ్ రికార్డు సర్వేలో జూనియర్ అసిస్టెంట్, అటెండర్ రూ.10 వేలు లంచం తీసుకుంటూ చిక్కారు.

10 నెలల క్రితం మామాడ మండలంలోని రెవెన్యూ ఆర్‌ఐ రూ.15వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికాడు. మామాడ పోలీస్ స్టేషన్ ఎస్పై రాజుల ఆరు నెలల క్రితం రూ.10 వేలు లంచం తీసుకుంటు దొరికాడు. ఇలా ఏడాదిలో 16 మంది ఏసీబీ చిక్కారు. అధికారుల వేధింపులు ఎక్కువ కావడంతో బాధితులు ఏసీబీని ఆశ్రయించిన ఘటనల్లో మాత్రమే వీరు పట్టుబడ్డారు. అయితే ప్రతీ కార్యాలయంలోనూ ఉద్యోగులు లంచాలు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. లేదం టే ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పించుకుంటున్నారు. 

విశ్రాంత ఉద్యోగుల వద్ద..

విచిత్రం ఏమిటంటే ప్రభుత్వం ఉద్యోగం చేసి, విరమణ పొందిన వి శ్రాంత ఉద్యోగులకు రావల్సిన పెన్షన్, ఇతర అవసరాల కోసం ప్రభుత్వ కార్యాలయాల్లో దరఖాస్తులు చేసుకున్నా.. లంచాలు డిమాండ్ చేస్తున్నట్టు తెలిసింది. ఇటీవలే విశ్రాంత ఉద్యోగుల సం ఘం సమావేశంలో జిల్లా అధ్యక్షుడు ఎంసి లింగన్న అదనపు కలెక్టర్ పైజాన్ అహ్మద్ ముందే ట్రేజరీ శాఖలో లంచం తీసుకుంటున్నారంటూ బహిరంగానే చెప్పడం విస్మయానికి గురి చేసింది. నిర్మల్‌లో ఆరు నెలల్లో ఆరుసార్లు ఏసీ బీ దాడులు జరిగి 10 మంది ఉద్యోగులు రెడ్ హ్యాండెడ్‌గా దొరికినా అధికారుల తీరు మాత్రం మారడం లేదు. 

నిర్భయంగా ఫిర్యాదు చేయాలి
ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు లంచాలు డిమాండ్ చేస్తే నిర్భయంగా ఏసీబీ ఫిర్యాదు చేయాలి. టోల్ ఫ్రీ నంబర్ 1054 ను సంప్రదించి ఫిర్యాదు చేయాలి. ప్రజలు ఈ ఆవకాశా న్ని సద్వినియోగం చేసుకోవాలి. లంచాలు ఇవ్వడం, తీసుకోవడం నేరం. 
 రమణమూర్తి, ఏసీబీ డీఎస్పీ