4 May, 2026 | 3:38 PM

Breaking News

సీసీ రోడ్డు పనులకు భూమిపూజ చేసిన మేయర్   •   అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం స్థలం కేటాయించాలంటూ తాసిల్దార్ కు వినతి   •   తల్లి ఏడవకండి.. మా ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది   •   ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకే చలివేంద్రం   •   కేరళం హస్తగతం.. యూడీఎఫ్ ఆధిక్యం   •   మాది రైతు ప్రభుత్వం భరోసా లేని రైతు జీవితానికి భరోసా కల్పిస్తాం: విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్   •   ఇంకా ఓడిపోయినట్లు కాదు.. ఎన్నికల ఫలితాలపై మమతా బెనర్జీ స్పందన   •   ప్లాస్టిక్ గ్లాస్లో చాయ్ తాగితే 3,000 జరిమానా   •   కాంగ్రెస్ పార్టీ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మారం రెడ్డి కౌటిల్ రెడ్డి   •   రైతు వేదికల్లో రైతులకు అవగాహన సదస్సులు   •  

జిల్లాలో ఉచిత క్రీడా శిక్షణ శిబిరాలు

04-05-2026 02:14 PM

జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి డాక్టర్ ఓలేటి జ్యోతి

మహబూబాబాద్, (విజయక్రాంతి): రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ హైదరాబాద్ వారి సహకారం జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ ఆదేశాల మేరకు మహబూబాబాద్ జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని 10 కేంద్రాలలో వాలీబాల్,  కరాటే, తైక్వాండో, వెయిట్ లిఫ్టింగ్ తదితర క్రీడలలో మే 5 నుండి జూన్ 7 వరకు తేదీ వరకు ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు, తిరిగి సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల వరకు ఉచిత క్రీడా శిక్షణా శిబిరాలు నిర్వహించనున్నట్లు జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి డాక్టర్ ఓలేటి జ్యోతి తెలిపారు. 14 సంవత్సరాల వయసు లోపు గల బాల బాలికలు క్రింద తెలిపిన నెంబర్ లకు ఫోన్ చేసి పేర్లు నమోదు చేసుకుని ఉచిత శిక్షణ పొందవచ్చని తెలిపారు. 

ఉచిత క్రీడా శిక్షణ శిబిరాల వివరాలు

వాలీబాల్ జెడ్.పి.హెచ్.ఎస్ , ఇనుగుర్తి మండలం మొబైల్ నెంబర్: 8074446952, వాలీబాల్ జయపురం, నరసింహులపేట మండలం  మొబైల్ నెంబర్: 7989563036, కరాటే జెడ్.పి.హెచ్.ఎస్ గార్ల మండలం మొబైల్ నెంబర్: 9133880071, బాస్కెట్ బాల్ జెడ్.పి.హెచ్.ఎస్ గార్ల లో మొబైల్ నెంబర్: 9959089101, తైక్వాండో  జెడ్.పి.హెచ్.ఎస్ , నేరెడ, కురవి మండలం మొబైల్ నెంబర్: 7981221078, , తైక్వాండో  జెడ్.పి.హెచ్.ఎస్ , తానంచర్ల, మరిపెడ మండలం మొబైల్ నెంబర్: 8367682925, తైక్వాండో  జెడ్.పి.హెచ్.ఎస్, కాట్రపల్లి మొబైల్ నెంబర్: 7731832925, వెయిట్ లిఫ్టింగ్, జెడ్.పి.హెచ్.ఎస్ ఉప్పలపాడు గ్రామం, బయ్యారం మండలం మొబైల్ నెంబర్: 8106868907, వెయిట్ లిఫ్టింగ్, అమ్మపాలెం గ్రామం, డోర్నకల్ మండలం మొబైల్ నెంబర్: 9396432219 ,నెట్ బాల్, జెడ్.పి.హెచ్.ఎస్, కల్వల, కేసముద్రం మండలం మొబైల్ నెంబర్:8522879345, పై నెంబర్లను సంప్రదించి 14 సంవత్సరాల బాల బాలికలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి తెలిపారు. మరిన్ని వివరాలకు జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి డాక్టర్ ఓలేటి జ్యోతి సెల్. 9440630681 నెంబర్ లో సంప్రదించగలన్నారు.