08-12-2025 01:31:32 AM
తాండూరు, డిసెంబర్7 (విజయక్రాంతి): కత్తెర గుర్తుకు ఓటేసి గ్రామపంచాయతీకి పంపిస్తే గ్రామాన్ని అభివృద్ధి చేసి జన్మభూమి రుణం తీర్చుకుంటానని వికారాబాద్ జిల్లా యాలాల మండలం నాగసముద్రం గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి భారతీయ జనతా పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి నరేష్ అన్నారు. ఆదివారం ఆయన పార్టీ నాయకులు గ్రామ పెద్దలు మరియు యువకులు, మహిళలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ కత్తెర గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి నరేష్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అందించే నిధులతో గ్రామం అభివృద్ధి చేసి తాండూర్ నియోజకవర్గంలో ఆదర్శ గ్రామపంచాయతీగా తీర్చి దిద్దుతానని అన్నారు.ఇక నరేష్ విద్యావంతుడు కావడం, గ్రామంలో చిన్న..పెద్ద అందరితో కలిసిమెలిసి ఉంటుండడంతో ప్రత్యర్థుల అంచనా లకు మించి విజయం వైపు... బంపర్ మెజార్టీఏ లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు.