16-07-2025 12:00:00 AM
బీఆర్ఎస్ నేత గాదరి కిషోర్
హైదరాబాద్, జులై 15 (విజయక్రాంతి): సీఎం రేవంత్ రెడ్డి మొనగాడు అయితే మమ్మల్ని ఎందుకు హౌస్ అరెస్టులు చేశారని బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ ప్రశ్నించారు. మంగళవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహిం చిన మీడియా సమావేశంలో గాదరి కిషోర్ మాట్లాడుతూ.. రాష్ర్ట మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ సొంత ఊర్లో రైతు రుణమాఫీ అయిందో లేదో చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు.
సోడా కలిపినంత ఈజీ కాదు గోదావరి నీళ్లు ఇచ్చుడు అని సీఎం అంటున్నారు.. కానీ బీఆర్‌ఎస్ హయాంలో తాము తుంగతుర్తికి గోదావరి నీళ్లు ఇచ్చామన్నారు. జగదీశ్ రెడ్డికి గంజి ఉందో బెంజ్ ఉందో నాగారం వచ్చి చూడాలనిఎద్దేవా చేశారు. ఇప్పటి వరకు ‘జై తెలంగాణ’ అని రేవంత్ ఒక్కసారి కూడా అనలేదని దుయ్యబట్టారు.