16-07-2025 12:00:00 AM
కత్తులతో దాడి చేసుకున్న ఇరువర్గాలు
ఇద్దరు మృతి, మరో ఇద్దరి పరిస్థితి విషమం
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో ఘటన
పెద్దపల్లి, జూలై 15 (విజయక్రాంతి): భార్యాభర్తల పంచాయితీలో ఇరువర్గాలు పరస్పరం కత్తులతో దాడి చేసుకోవడంతో ఇద్దరు మృతిచెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నది. ఈ ఘటన పెద్దపల్లి జి ల్లా సుల్తానాబాద్ శివారులోని సుగ్లంపల్లి లో మంగళవారం జరిగింది. ఓదెల మండలానికి చెందిన మోటం మారయ్య, లక్ష్మి దం పతులకు 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది.
ఇరువురి మధ్య మనస్పర్ధలు రావడంతో కొంతకాలం గా విడిగా ఉంటున్నారు. ఇరు కుటుంబాల సభ్యు లు రాజీ కు దుర్చడానికి సుగ్లంపల్లిలో ప్రాంతంలో మంగళవారం పంచాయితీ నిర్వహించారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య మాటామాట పెరిగి ఒకరిపై ఒకరు కత్తులతో దాడి చేసుకున్నారు. దీంతో మారయ్య సోదరుడు మల్లేశ్ అక్కడిక్కడే మృతిచెందాడు.
లక్ష్మి తరఫున వచ్చిన గణేశ్ అనే వ్యక్తికి తీవ్రగాయాలు అవడంతో ఆసుపత్రి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మారయ్య బంధువులు మ ధునయ్య, సారయ్య తీవ్ర గాయాలతో కరీంనగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నా రు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.