16-07-2025 12:00:00 AM
- విక్రయించిన మెడికల్ షాప్ యజమానిపై కేసు నమోదు, రిమాండ్‌కు తరలింపు
- డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు
- మెడికల్ షాప్ నిర్వాహకులకు
- వేములవాడ ఏ.ఎస్పీ శేషాద్రిని రెడ్డి హెచ్చరిక
రాజన్న సిరిసిల్ల: జూలై 15 (విజయక్రాంతి) మైనర్ బాలికకు గర్భస్రావంఅబార్షన్ అయ్యేలా మందులు విక్రయించిన మెడికల్ షాప్ యజమానిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు వేములవాడ ఏ.ఎస్పీ శేషాద్రిని రెడ్డి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం ఓ మైనర్ బాలికను సిరిసిల్లకు చెందిన ఓ యువకుడు ప్రేమ, పెళ్లి పేరుతో అట్టి మైనర్ బాలికను శారీరకంగా వాడుకొగా అట్టి బాలిక గర్భం దాల్చగా అట్టి గర్భం పోవడానికి సిరిసిల్ల పట్టణానికి చెందిన గీతాంజలి మెడికల్ షాప్ యజమాని.
నల్లా శంకర్ ను ఆశ్రయించి ఒక మైనర్ బాలికకు గర్భం పోవడానికి మందులు ఇవ్వ మనగా అట్టి గీతాంజలి షాప్ ఓనర్ చట్ట వ్యతిరేకంగా ఎలాంటి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా గర్భం పోవడానికి మందులు ఇవ్వగా అట్టి మందులను వేసుకున్న మైనర్ బాలికకు గర్భ స్రావం అయినది. ఈ విషయంపై కేసు నమోదు చేసి గతంలో అట్టి యువకుడిని మే 30న అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించడం జరిగింది.
మరియు చట్ట వ్యతిరేకంగా మైనర్ బాలికకు గర్భం పోవడానికి మందులు ఇచ్చిన గీతాంజలి మెడికల్ షాప్ ఓనర్ నల్ల శంకర్12- 07- 2025 రోజున రి మాండ్ కు తరలించనైనది.డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయిస్తే చర్యలు తప్పవు..ఈ సందర్భంగా ఏ.ఎస్పీ మాట్లాడుతూ డాక్టర్ పిస్క్రిప్షన్ లేకుండా మరియు చట్టానికి వ్యతిరేకంగా మెడికల్ షాప్ నిర్వాహకులు ఎవరైనా మందులు విక్రయిస్తే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మందులు విక్రయిస్తున్న తరుణంలో నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులను విక్రయించి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడే వారినీ ఉపేక్షించేది లేదని తెలిపారు.