ధీరజ్ బృందానికి పసిడి

29-04-2024 12:42:43 AM

ఆర్చరీ ప్రపంచకప్

భారత్‌కు 8 పతకాలు

షాంఘై: ఆర్చరీ ప్రపంచకప్‌లో తెలుగు ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ బృందం సంచలనం సృష్టించింది. ఆదివారం జరిగిన పురుషుల రికర్వ్ టీమ్ ఫైనల్లో ధీరజ్ , తరుణ్‌దీప్ రాయ్, ప్రవీణ్ జాదవ్‌లతో కూడిన భారత జట్టు 5 దక్షిణ కొరియాకు చెందిన లీ వూసియోక్, కిమ్ జె డియోక్, కిమ్ వూజిన్ త్రయంపై విజయం సాధించింది. ప్రపంచకప్ రికర్వ్ విభాగంలో భారత్‌కు స్వర్ణం దక్కడం 14 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం. 2010లో షాంఘైలో జరిగిన ఆర్చరీ ప్రపంచకప్‌లో రాహుల్ బెనర్జీ, తరుణ్‌దీప్, జయంత బృందం జపాన్‌ను ఓడించి గోల్డ్ మెడల్ దక్కించుకుంది. ఈ రెండు ఈవెంట్స్‌లోనూ 40 ఏళ్ల తరుణ్‌దీప్ సభ్యుడిగా ఉండడం విశేషం. ఇక ధీరజ్ స్వర్ణంతో పాటు కాంస్యంతోనూ మెరిశాడు. రికర్వ్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో అంకిత ద్వయం 6 మెక్సికోకు చెందిన అలెజండ్రా వలెన్సియా గ్రాండే జంట ను మట్టికరిపిం చిం ది. ఇక ఏడాదిన్నర విరామం తర్వాత రీఎంట్రీ ఇచ్చిన మరో ఆర్చర్ దీపిక కుమారి రజతంతో సరిపెట్టుకుంది. మహిళల వ్యక్తిగత రికర్వ్ విభాగం ఫైనల్లో దీపిక.. కొరియాకు చెందిన లిమ్ సియోన్ చేతిలో ఓటమిపాలైంది. ఇక ఈ ప్రపంచకప్‌ను భారత్ 8 పతకాలతో ముగించింది. ఇందులో 5 స్వర్ణాలు, 2 రజతాలు, ఒక కాంస్యం ఉన్నాయి.