09-01-2026 12:00:00 AM
ముఖ్య సమన్వయకర్తగా పార్థసారథి
డాక్టర్ గజల్ శ్రీనివాస్ వెల్లడి
హైదరాబాద్, జనవరి 8 (విజయక్రాంతి): ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో ఈ నెల 9, 10 తేదీల్లో మారిషస్‌లో జరుగబోయే నాలుగో ప్రపంచ తెలుగు మహా సభలకు ముఖ్య సమన్వయకర్తగా బృందావన పార్థ సారథిను మారిషస్ వారిని నియమించినట్లు ఆంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షుడు డాక్టర్ గజల్ శ్రీనివాస్ తెలిపారు. ఈ నియామక ఉత్తర్వుల ప్రతిని మారిషస్ దేశాధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ దంపతులు, తిరుమల తిరుపతి దేవస్థాన సంయుక్త కార్య నిర్వహణాధికారి వెంకన్న చౌదరి చేతుల మీదుగా తిరుమల పద్మావతి అతిథి గృ హంలో అందజేశారు. బృందావన పార్థ సారథి 4వ ప్రపంచ తెలుగు మహా సభల నిర్వహణ, వివిధ స్థానిక కమిటీల నియామకం, వేదికల ఎంపిక, వసతి, విదేశీ ప్రతినిధుల స్థానిక పర్యాటక ప్రయాణ ఏర్పా ట్ల బాధ్యతలను నిర్వహిస్తారని డా.గజల్ శ్రీనివాస్ తెలిపారు.