09-01-2026 12:00:00 AM
ఎంపీటీసీ పోరం రాష్ట్ర మాజీ అధ్యక్షులు దేవి రవీందర్
గజ్వేల్, జనవరి 8 : పెరిగిన జనాభా ప్రకారం గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలో వార్డులను పెంచాలని ఎంపీటీసీ పోరం రాష్ట్ర మాజీ అధ్యక్షులు దేవి రవీందర్, లక్ష్మపూర్ తాజా మాజీ సర్పంచ్ కొలిచేలిమి స్వామి ఆధ్వర్యంలో గురువారం సిద్దిపేట కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో చేసిన వార్డుల విభజనతో ప్రజలు అయోమయానికి గురవుతున్నారన్నారు.
వార్డులను ఎక్కువ దూరం విస్తరించడంతో ప్రజల సమస్యల పరిష్కారానికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్నారు. ప్రజల సూచనలు ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు తెలుసుకోకుండానే అధికారులు ఏకపక్షంగా వార్డుల విభజన చేశారని, పెరిగిన జనాభా ప్రకారం వార్డులను విభజించాలని కోరారు. వారి వెంట దావత్ శ్రీనివాస్ నాగేష్ బి పరశురాములు పి రమేష్ ఎం రాము తదితరులున్నారు.