13 July, 2026 | 9:36 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

భక్తులతో కిక్కిరిసిన దేవాలయాలు

28-03-2026 12:00 AM

ఆలయ నిర్వాహకులు, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో

 అన్నదానం, తీర్థ ప్రసాదాల, పంపిణీ 

మణుగూరు, మార్చి 27 (విజయక్రాంతి) : మండల వ్యాప్తంగా వాడ వాడన  శ్రీరామ నవమి వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. మణుగూరు పట్టణంతోపాటు మండలంలోని పలు గ్రామాలలోని శ్రీరామ నవమిని పురస్కరించుకోని శ్రీ సీతారామ చంద్రస్వామి వారి కల్యాణాన్ని అర్చకు లు, పూజారులు కన్నుల పండుగగా నిర్వ హించారు. సమితి సింగారం రామాల యం,బాలాజీ నగర్ కోదండ రామాల యం, శివలింగాపురం, పీకే వన్ సెంటర్, పైలెట్ కాలనీ, సాయి బాలాజీ నగర్,పీవీ కాలనీతో పాటు పలు గ్రామాలలోని  ఆలయాలలో వాడవాడలా చలువ పందిర్లు వేసి శ్రీసీతారాముల కల్యాణాన్ని వేద మంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ ఘనంగా నిర్వహించారు. ఆల యాలకు భక్తులు పోటెత్తారు.

వేదపండి తుల మంత్రోచ్ఛరణాల మధ్య జరిగిన రాములోరి కల్యాణాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఉదయం నుంచే ఆలయాలకు చేరుకుని సీతారాములకు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించు కున్నారు. అనంతరం మధ్యాహ్న సమ యంలో జరిగిన స్వామివారి కల్యాణాన్ని తిలకించి పునీతులయ్యారు. కల్యాణాన్ని తిలకించేందుకు వచ్చిన భక్తులకు వ్యాపా ర, స్వచ్ఛంద సంస్థలు మజ్జిగ, పానకం, పులిహోర, మంచినీరు ప్యాకెట్లను అందించారు. ఆలయాల కమిటీలు, ఆయా సంఘాల ఆధ్వర్యంలో భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేసి  భారీ అన్న దానం చేశారు. ఆయా ప్రాంతాలలో వేదమంత్రాలు, భాజా భజంత్రీల మోతల తో  శ్రీరామనవమి వేడుకలతో సందడి వాతావరణం నెలకొన్నది.