22 May, 2026 | 10:50 PM

Breaking News

మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు   •   ప్రభాకర్ ఆశయ సాధనకు కృషి చేయాలి   •   సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటాలు ఏర్పాటు చేయాలి   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   పేకాట స్థావరంపై దాడి   •   వన్య ప్రాణులను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్టు, రిమాండ్   •   మద్యం సేవించి మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నకిలీ విలేకరులు   •   చందుర్తి మండలంలో డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు ప్రత్యేక తనిఖీలు   •   ఆనందోత్సాహాల మధ్య ఆత్మీయ సమ్మేళనం   •   శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న కంచి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి   •  

ఘనంగా సీతారాముల కల్యాణం

28-03-2026 12:00 AM

పాల్గొన్న ఎమ్మెల్సీ దండే విఠల్ 

బెజ్జూర్, మార్చి 27, (విజయ క్రాంతి) : కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలంలో అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం నిర్వహించారు. బెజ్జూరు మండలంలోని బెజ్జూరు, ఎలుక పెళ్లి, కృష్ణ పల్లి పాపన్నపేట, సలుగు పల్లి ,చిన్న సిద్దాపూర్ తదితర గ్రామాల్లో సీతారాముల కళ్యాణం మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం నుండి గ్రామాల్లో శోభాయాత్ర నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు.

మండల కేంద్రంలోని రం గనాయక దేవాలయం, ఎలుకపల్లి బి అభయాంజనేయ ఆలయాల్లో ఉమ్మడి ఆదిలాబాద్ ఎమ్మెల్సీ దండేవిటల్ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ఆలయ కమిటీ అధ్యక్షులు తంగేడి పల్లి మహేష్, స్థానిక సర్పంచులు దుర్గం సరోజ తిరుపతి, సెండే. పద్మ, లావణ్య, బెజ్జూరు ఉపసర్పంచ్ రాచకొండ ఆదర్శ్, కాంగ్రెస్ నాయకులు కొండ్ర జగ్గా గౌడ్, సిడం గణపతి, డబ్బుల నానయ్య, డబ్బుల వెంకన్న, కోట్రంగి రామకృష్ణ, పుల్లూరు సతీష్, శ్రీకాంత్, నరేందర్ గౌడ్, ఆలయాల కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.