యూరియా తిని పది మేకల మృతి
30-06-2025 08:19 AM
రూ 1.50 లక్షల నష్టం
మాదారంలో సంఘటన
ములకలపల్లి,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem District) ములకలపల్లి మండలం నాగారంలో యూరియా తిని పది మేకలు మృతి చెందిన సంఘటన వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే మండల పరిధిలోని మాదారం గ్రామపంచాయతీ మంగపేట గ్రామంలో వాడే దారయ్య కు చెందిన పది మేకలు ఒకేసారి కుప్పకూలాయి. మాదారం కు చెందిన ఓ రైతు తన ట్రాక్టర్ పై యూరియా బస్తాలను తరలిస్తుండగా ఒక బస్తా కింద పడిపోయింది. ఆ రైతు పూర్తిస్థాయిలో యూరియా ఎత్తకుండా కొంతమేరకు వదిలి వెళ్ళాడు. రోడ్డుపై పడిన యూరియాను తిన్న మేకలు అక్కడే మృతి చెందాడు. వాటి విలువ రూ 1.50 లక్షల ఉంటుందని మేకల యజమాని ధారయ్య వాపోయాడు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.






