calender_icon.png 30 June, 2025 | 9:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్షేత్రస్థాయి పర్యటనలతో మెదక్ కలెక్టర్ రికార్డు!

30-06-2025 03:37:57 AM

  1. అధికారుల పనితీరులో పెనుమార్పులు
  2. సంక్షేమ ఫలాలు పేదలకు అందేలా కృషి
  3. ఈ ఆఫీస్‌తో వేగవంతంగా పనులు 
  4. మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ పనితీరుపై విజయక్రాంతి స్పెషల్

మెదక్, జూన్ 29(విజయక్రాంతి): పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత ఏడాది సమయంలో సుమారుగా 255 రో జుల పాటు క్షేత్రస్థాయి పర్యటనలో నిమగ్నమై విప్లవాత్మక మార్పులకు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ శ్రీకారం చు ట్టారు. 90 శాతం క్షేత్రస్థాయి పర్యటనలు చేసిన ఘనత ఆయనకే దక్కింది. జిల్లా అభివృద్ధి సంక్షేమ పథకాల అమలులో కలెక్టర్ పాత్రపై ప్రత్యేక కథనం..

పేద ప్రజలకు విద్య, వైద్యం, సంక్షేమ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెడుతూనే ప్రభుత్వ పథకాలను పారదర్శకంగా, పకడ్బందిగా సమర్థవంతమైన పాలనను ప్రజలకు అందిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జిల్లా పాలనా బాధ్యతలు స్వీకరించిన వెంటనే , విద్యా ,వైద్యం,వ్యవసాయం, విద్యుత్, మహిళా సాధికారత తదితర రంగాలపై ప్రత్యేక శ్రద్ధ వహించారు.

వ్యవసాయ రంగంపై ప్రత్యేక దృష్టి..

ప్రభుత్వ సూచనలు, సలహాలు పాటిస్తూ వ్యవసాయరంగంపై ప్రత్యేక దృష్టి సారించిన కలెక్టర్ క్షేత్రస్థాయిలో పంట పొలాలలో రైతులను నేరుగా కలిసి వ్యవసాయ స్థితిగతులను తెలుసుకొని రైతులు ఒకే పంటపై ఆధారపడకూడదని అంతర్ పంటల సాగు ద్వారా ఆర్థిక అభివృద్ధి చెందాలని తెలియజే స్తూ .రైతుల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు కలెక్టర్ వివి ధ మార్గాలను అన్వేషించి తద్వారా చర్యలు తీసుకుంటున్నారు. 

ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణ.. 

జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలు వసతి గృహా ల్లో నెలకొన్న సమస్యలను తెలుసుకోవడానికి కలెక్టర్ స్వయం గా రాత్రి బస, ఆకస్మిక తనిఖీలు నిర్వహించి తానే స్వయంగా ప్రతి పాఠశాలలో ఉన్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కావల్సిన ప్రణాళికలను రూపొందించారు. నాణ్యమైన గుణాత్మక విద్య అందించడానికి ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ప్రవేశపెట్టి విద్యా నైపుణ్యాలు పెంచే దిశగా కృషి చేశారు. అ మ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ఆధ్వర్యంలో 562 పాఠశాల ల్లో మౌలిక వసతులు కల్పిస్తూ నాణ్యమైన గుణాత్మక విద్యను అందించడానికి కృషి చేశారు. 

ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ...

వైద్య ఆరోగ్య శాఖను మరింత పట్టిష్టం చేస్తూ ప్రజలకు సమగ్ర వైద్యం అందించేందుకు జిల్లా కలెక్టర్ తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ, సీసీటీవీ కెమెరాలు ద్వారా ఆసుపత్రి సిబ్బంది సమయపాలనపై ప్రత్యేక దృష్టి సారించడం వ ల్ల వైద్య సిబ్బంది తమ విధులను క్రమశిక్షణగా నిర్వహిస్తూ సెలవు రోజుల్లో కూడా అందుబాటులో ఉంటున్నారు. ప్రతి ఒక్క రోగికి సరైన సేవలు అందేలా వైద్య సిబ్బందికి మార్గనిర్దేశం చేసి, పర్యవేక్షణ వ్యవస్థను బలోపేతం చేశారు. ఈ ఆఫీస్ విధానాన్ని అమలు చేసి ప్రతి ఫైలు ఈ ఆఫీసులో రావాలని, మాన్యువల్ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని ఆ దిశగా ప్రతి శాఖ ఫైల్స్ ఆన్లైన్ ద్వారా పరిష్కరిస్తూ చర్యలు తీసుకున్నారు. 

క్షేత్రస్థాయి పర్యటనలతో మమేకం.. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

అధికారులు సంక్షేమ పథకాల అమలుపై క్షేత్రస్థాయిలో పర్యటిస్తే ప్రజలతో మమేకమై ఫలాలు సక్రమంగా అందేలా కృషి చేయవచ్చు. ఆయా శాఖల పనితీరు మెరుగుపర్చవచ్చు. అధికారుల పనితీరును నిరంతరం సమీక్షిస్తూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. దీంతో ప్రభుత్వం అందిస్తున్న సేవలు నేరుగా అందేలా చర్యలు తీసుకుంటున్నాం.