calender_icon.png 12 December, 2025 | 4:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇండిగో ప్రయాణికులకు పదివేల ట్రావెల్ వోచర్లు

12-12-2025 01:52:55 AM

  1. 12 నెలల్లో ఇండిగోలో వినియోగించుకోచ్చు
  2. తాజాగా 1,900కి పైగా సర్వీసులను నడుపుతున్న ఇండిగో

న్యూఢిల్లీ, డిసెంబర్ 11, (విజక్రాంతి): ఇండిగో సిబ్బంది కొరత కారణంగా డిసెంబర్ 3-5 తేదీల్లో విమానాశ్రయాలలో ఏర్పడిన గందరగోళంలో తీవ్రంగా ప్రభావితమైన ప్రయాణికులకు పరిహారంగా రూ.10,000 అందజేస్తామని ఆ విమానయాన సంస్థ గురువారం ప్రకటించింది. అయితే, ‘తీవ్రంగా ప్రభావితం‘ అంటే ఏమిటో, పరిహారం చెల్లింపు కోసం ఆ ప్రయాణికులను ఎలా గుర్తిస్తారో ఇండిగో స్పష్టం చేయలేదు.

అనేక రోజులుగా వందలాది విమానాలను రద్దు చేసినందుకు విమర్శలు, ప్రతిచర్యలను ఎదుర్కొం టున్న ఈ విమానయాన సంస్థ, రద్దు చేయబడిన విమానాలకు అవసరమైన రీఫండ్లను ఇప్పటికే అందజేశామని ఒక ప్రకటనలో తెలిపింది. ‘డిసెంబర్ 3/4/5 తేదీలలో ప్రయా ణిస్తున్న మా కస్టమర్లలో కొంతమంది కొన్ని విమానాశ్రయాలలో చాలా గంటల పాటు చిక్కుకుపోయారు. వారిలో చాలా మంది రద్దీ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అటువంటి కస్టమర్లకు మేము రూ.10,000 విలువైన ట్రావెల్ వోచర్లను అందిస్తాం’ అని ఇండిగో విమానయాన సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ ట్రావెల్ వోచర్లను రాబోయే 12 నెలల్లో ఇండిగోలో ఏ భవిష్యత్ ప్రయాణానికైనా ఉపయోగించుకోవచు అని స్పష్టం చేసిం ది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం, విమానం బయలుదేరే సమయానికి 24 గంటలలోపు విమానాలు రద్దు చేయబడిన కస్టమర్లకు తాము వాగ్ధానం చేసిన రూ.5,000-, రూ. 10,000 పరిహారానికి ఇది అదనమని ఇండిగో పేర్కొంది. ‘ఇండిగోలో, మీరు మా నుంచి ఆశించే సురక్షితమైన, సులభమైన, నమ్మకమైన అనుభవాన్ని పునరుద్ధరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీకు మళ్లీ సేవ చేసే అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు’ అని పేర్కొంది.

అన్ని గమ్యస్థానా లకు తమ సేవలు ఇప్పుడు నాలుగు రోజులుగా పునరుద్ధరించామన్నారు. రోజురోజుకూ తన సేవలను మెరుగుపరుస్తూ, ఇప్పుడు మా నెట్వవ ర్క్‌లోని 138 గమ్యస్థానాలను సజావుగా కలుపుతూ 1,900కి పైగా విమానాలను నడుపుతోందని పేర్కొన్నారు. పౌర విమానయాన మంత్రి కింజరపు రామ్మోహన్  మాట్లా డుతూ, తాము కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.