08-11-2025 12:00:00 AM
పాఠశాలల్లో సంగీత విద్య రద్దుపై భగ్గుమన్న పౌరులు
ఢాకా, నవంబర్7: బంగ్లాదేశ్ తాత్కాలిక అధినేత మొహమ్మద్ యూ నస్ ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయంపై తీవ్రమైన విమర్శలకు దారి తీసింది. ప్రాథమిక పాఠశాలల్లో సంగీ తం, శారీరక విద్య(ఫిజికల్ ఎడ్యుకేషన్) ఉపాధ్యాయుల నియామక ప్రక్రియను రద్దు చేయాలనే నిర్ణయంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి.
ప్రభు త్వం తీసుకున్న ఆ చర్య సాంస్కృతిక నియంతృత్వమని ‘హెఫాజత్- ఏ -ఇస్లాం’, ‘ఇస్లామీ ఆందోళన్’ సంస్థలు పేర్కొన్నాయి. యూనస్ ‘ఇస్లాం’ వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నారని ఆందోళ నలు చేపట్టాయి. దీంతో దేశరాజధాని ఢాకా శుక్రవారం అట్టుడికింది. యూన స్ ప్రభుత్వం లౌకిక, భిన్నత్వంలో ఏకత్వం స్ఫూర్తిగా విరుద్ధంగా వ్యవహరి స్తుందని మండిపడ్డారు.