08-11-2025 12:00:00 AM
2026 ఆరంభంలో వచ్చే అవకాశం
న్యూఢిల్లీ/వాషింగ్టన్, నవంబర్ 7: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చే ఏడాది ఆరంభంలో భారత్‌లో పర్యటించే అవకాశం ఉందని వైట్‌హౌస్ వర్గాలు స్పష్టం చేశాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈమేరకు ఆయన్ను వాణిజ్య చర్చలకు ఆహ్వానించగా, ఈమేరకు ట్రంప్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలసింది. ఇరు దేశాధినేతలు ఈ సందర్భంగా ద్వైపాక్షిక భేటీ నిర్వహిస్తారని,
మధ్య వాణిజ్య సంబంధాలు బలోపేతానికి కృషిచేస్తారని భారత విదేశాంగవర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. అయితే.. ట్రంప్ పర్యటన అధికారిక తేదీలు, పూర్తి సమాచారాన్ని భారత ప్రభుత్వం ధ్రువీకరించాల్సి ఉంది. త్వరలో భారత ప్రభుత్వం ‘క్వాడ్ స మ్మిట్’కు ఆతిథ్యమిస్తున్న నేపథ్యంలో ట్రంప్ భారత్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకున్నది.