calender_icon.png 8 November, 2025 | 4:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ మోడల్ స్కూల్స్ టీచర్స్ నూతన సంఘం టిజి.టీమ్స్ ఆవిర్భావం

08-11-2025 02:45:41 PM

హనుమకొండ,(విజయక్రాంతి): తెలంగాణ మోడల్ స్కూల్స్ ఉపాధ్యాయుల సంక్షేమం, వృత్తిపరమైన స్థిరత్వం కోసం  టీజీ.టీమ్స్ అనే నూతన సంఘం శనివారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఘనంగా ఆవిర్భవించింది. తెలంగాణ మోడల్ స్కూల్ ను స్కూల్ ఎడ్యుకేషన్ విభాగంలో విలీనం చేయడం, మరియు 010 హెడ్ ఆఫ్ అకౌంట్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా వేతనాలు చెల్లించబడే విధానాన్ని అమలు చేయాలి అనేవి సంఘం ప్రధాన లక్ష్యాల తో ఈ సంగం ఆవిర్భవించింది. అనంతరం ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో వ్యవస్థాపక అధ్యక్షుడు ఆర్.కిరణ్ మాట్లాడుతూ... ఈ నూతన సంఘం ఏర్పాటు మోడల్ స్కూల్స్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది.

తెలంగాణ విద్యా వ్యవస్థకు మోడల్ స్కూల్స్ ఆదర్శంగా నిలుస్తున్నప్పటికీ, ఉపాధ్యాయుల సేవా నిబంధనలు ఇంకా అసమగ్రంగానే ఉన్నాయని, మోడల్ స్కూల్స్ ఉపాధ్యాయులను సాధారణ పాఠశాల ఉపాధ్యాయులతో సమానంగా గుర్తించి, మోడల్ స్కూల్స్ సొసైటీని రద్దుచేసి స్కూల్ ఎడ్యుకేషన్ విభాగంలో విలీనం చేయడం అత్యవసరమని, 010 అమలు అనేది మోడల్ స్కూల్స్ ఉపాధ్యాయులకు సంబంధించి దీర్ఘకాలికంగా నెలకొన్న అనేక సమస్యలకు పరిష్కారమనీ పేర్కొన్నారు. అదేవిధంగా 010 పద్దు ద్వారా వేతనాలు చెల్లించి, మోడల్ స్కూల్స్ ను పాఠశాల విద్యాశాఖలో విలీనం చేయడం, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్స్ కు గెజిటెడ్ హోదా కల్పించడం, తదుపరి పదోన్నతి అవకాశం కల్పిస్తూ, ఖాళీగా ఉన్న పోస్టులలో పిజిటిలకు ప్రిన్సిపాల్స్ గా, టీజీటీలకు పీజీటీలుగా వెంటనే ప్రమోషన్ కల్పించి, మిగిలిన ఖాళీలకు నూతన నోటిఫికేషన్ విడుదల చేసి నియమాకం చేపట్టాలన్నారు.

మోడల్ స్కూల్స్ ప్రారంభించిన ఈ 12 సంవత్సరాల కాలంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు 40 మందిపైగా మరణించడం జరిగిందని,ఆ కుటుంబాలకు వెంటనే కారుణ్య నియమాకాలుచేపట్టి వారి కుటుంబాలకు డెత్ గ్రాడ్యుటిగానీ ఫ్యామిలీ పెన్షన్ వంటి ఆర్థిక ప్రయోజనాలు కల్పించాలన్నారు. మోడల్ స్కూల్స్ ఉపాధ్యాయులకు ఇప్పటివరకు ఆరోగ్య భద్రత కార్డులు ఇవ్వలేదు. వెంటనే ఆరోగ్య భద్రత కార్డులు ఇవ్వాలని,పరిపాలనా సౌలభ్యం కొరకు మోడల్ స్కూల్స్ ఉపాధ్యాయులను దశలవారీగా నియమించడం జరిగిందనీ, రెండవ దశలో నియమించబడిన ఉపాధ్యాయులు పిఆర్చి ఫిట్మెంట్ కోల్పోయారు. కావున గౌరవ హైకోర్టు ఆదేశాల అనుసారంగా వారికి నోషనల్ బెనిఫిట్ కల్పించాలి.

ఔట్సోర్సింగ్, హవెర్లీ బేస్డ్ టీచర్స్, మరియు ఒకేషనల్ టీచర్స్ వేతనాలు రెగ్యులర్గా చెల్లించాలనే లక్ష్యాలతో నూతన సంఘం టీజీ టీమ్స్ రాష్ట్రవ్యాప్తంగా మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల వృత్తిపరమైన హక్కులు, స్థిరమైన వేతన విధానం, మరియు సంక్షేమ కార్యక్రమాల సాధన కోసం సమన్వయంతో పనిచేయనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి డా.కట్కూరి మహేందర్, ఉపాధ్యక్షుడు గోపగాని విక్రమ్, కోశాధికారి ఎడ్ల రమేష్, శ్రీధర్ రెడ్డి, భాష బోయిన గంగరాజు, రామగిరి రాజు, రేణికుంట్ల శ్యామ్ కుమార్, శశి కుమారి కళ్యాణ్ సింగ్, అన్వర్ పాషా, రమేష్ తదితరులు పాల్గొన్నారు.