08-11-2025 01:59:05 PM
హైదరాబాద్: ఉప్పల్ మల్లికార్జుననగర్ లో కానిస్టేబుల్ ఆత్మహత్య(Constable) చేసుకున్నాడు. ఇంట్లో ఉరేసుకొని కానిస్టేబుల్ శ్రీశాంత్(42) ప్రాణాలు తీసుకున్నాడు. 2009 బ్యాచ్ కు చెందిన శ్రీకాంత్ ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్(Film Nagar Police Station)లో విధులు నిర్వహిస్తున్నాడు. కానిస్టేబుల్ శ్రీకాంత్ గత నెల 23 నుంచి విధులకు హాజరుకాలేదని అధికారులు పేర్కొన్నారు. ఆర్థిక సమస్యలే ఆత్మహత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. కుటుంబ సభ్యుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.