calender_icon.png 8 November, 2025 | 4:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమీన్‌పూర్ తహసీల్దార్‌పై దాడి

08-11-2025 02:25:58 PM

హైదరాబాద్: సంగారెడ్డి జిల్లాలోని అమీన్ పూర్ తహసీల్దార్ వెంకటేశ్ పై దాడి జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అమీన్ పూర్ లోని 630 సర్వే నంబర్ లోని ప్రభుత్వ భూమిలో కొందరు కబ్జాదారులు అక్రమంగా షెడ్డు వేశారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ వెంకటేశ్ అక్రమంగా నిర్మించిన షెడ్డును వెంటనే తొలగించాలని కబ్జాదారులను హెచ్చరించారు. దీంతో కబ్జాదారులు తహసీల్దార్ వెంకటేష్ పై దాడికి దిగారు. ఈ దాడిలో వెంకటేశ్ కు తీవ్రగాయాలు కావడంతో వెంటనే చికిత్స  నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.  ఈ మేరకు కబ్జాదారులపై కేసు నమోదు చేసినట్లు అమీన్ పూర్ పోలీసులు వెల్లడించారు.