calender_icon.png 12 December, 2025 | 2:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గౌతాపూర్ లో ఉద్రిక్తత

10-12-2025 07:58:52 PM

నిబంధనలకు విరుద్ధంగా.. 

ఎన్నికల ప్రచారం కోసమే వచ్చారంటూ... 

ఎమ్మెల్యే కాన్వాయ్ ని అడ్డుకున్న బీఆర్ఎస్ శ్రేణులు

ప్రచారం కోసం కాదు... బంధువును పరామర్శించేందుకు వచ్చా: ఎమ్మెల్యే

తాండూర్ (విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా తాండూరు మండలం గౌతాపూర్ లో బుధవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పంచాయతీ ఎన్నికల సందర్భంగా గ్రామంలో పర్యటించిన తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఎన్నికల నిబంధనావళికి విరుద్ధంగా 100 మంది కార్యకర్తలతో వచ్చి స్థానిక బీజేపీ నేతను కలవడం పట్ల గౌతాపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నేతలు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా 100 మందితో వచ్చి బీజేపీ నేతను కలవడం పట్ల నిరసిస్తూ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యే కాన్వాయిని అడ్డుకున్నారు. ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. స్థానిక బీజేపీ నేత ఇంటి వద్ద కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

సకాలంలో పోలీసులు రంగ ప్రవేశం ఎమ్మెల్యే కాన్వాయ్ ని అక్కడి నుంచి పంపించి వేశారు. ఇదిలా ఉండగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అనారోగ్యానికి గురైన తమ ఆత్మీయ బంధువు, బీజేపీ నేతను పరామర్శించడానికి వచ్చానని.. ప్రచారం చేసేందుకు రాలేదని.. బాల్ బచ్చా, పోరాబట్టి రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. మరోవైపు ప్రచారం గడువు ముగిసిన తర్వాత గ్రామంలో ఎమ్మెల్యే పర్యటనపై తక్షణమే జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకొని ఎన్నిక నిబంధనలను ఉల్లంఘించిన స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, అతనితో పాటు వచ్చిన నేతలపై కేసు నమోదు చేయాలని స్థానిక బీఆర్ఎస్ నేత మాజీ ఎంపీపీ రాజప్ప గౌడ్ డిమాండ్ చేశారు.