10-12-2025 08:04:32 PM
భద్రాద్రి పవర్ ప్లాంట్ సిఈ బిచ్చన్న..
మణుగూరు (విజయక్రాంతి): ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానం చేయాలని, తద్వారా ప్రాణ దాతలు కావాలని భద్రాద్రి పవర్ ప్లాంట్ సిఈ బిచ్చన్న ప్రజలకు పిలుపునిచ్చారు. బుధవారం కింగ్ డామ్ కల్చర్ మినిస్ట్రీ, హెల్పింగ్ హాండ్స్ సంస్థలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంను ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
ముఖ్యంగా యువత అపోహలు మాని రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని కోరారు. ఈ సందర్భంగా బిటిపిఎస్ ఉద్యోగులు, ఎస్పిఎఫ్ సిబ్బంది పాల్గొని 114 యూనిట్ల రక్తాన్ని ఇచ్చారు. కార్యక్రమంలో భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారి గోపాలకృష్ణ, సూపరిండెంట్ ఇంజనీర్లు సూర్యనారాయణ, రమేష్ బాబు, డివిజనల్ ఇంజనీర్లు మురళీకృష్ణ, ఆనంద ప్రసాద్, భీమ్య, వెంకటనాయుడు, శరత్ అసిస్టెంట్ మేనేజర్ (హెచ్ఆర్) సుగుణాకర్ రావు, ఆరిఫ్, ప్రసాద్, సాదిక్, రామ చందర్ పాల్గొన్నారు.