calender_icon.png 13 November, 2025 | 4:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మల్లాపూర్‌లో ఉద్రిక్తత

13-11-2025 12:00:00 AM

ప్రైవేటు భూమిని పార్కు స్థలంగా మార్చారంటూ బాధితుల ఆందోళన

బాధితులపై కార్పొరేటర్ బూతు పురాణం

ఉప్పల్, నవంబర్ 12 (విజయక్రాంతి) : ఉప్పల్ నియోజకవర్గం లోని మల్లాపూర్ డివిజన్ నాగలక్ష్మి నగర్ కాలనీ 109 సర్వే నెంబర్ లో ఉన్న 97 గజాల భూమికి పట్టా ఉన్నప్పటికీ పార్కు స్థలంగా పరిగణించడం తో బాధితులు ఆందోళన దిగారు. స్థానిక కార్పొరేటర్ మూడు లక్షల రూపాయలు డిమాండ్ చేశారని అవి ఇవ్వనందుకే పక్కన ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూమిలోకి తమ భూమిని కలిపి ప్రహార నిర్మించేందుకు ప్రయత్నం చేస్తున్నారని బాధితుల ఆరోపిం చారు.

దీనిని గాను స్థానిక కార్పొరేటర్ బాధితులపై బూతు పురాణం చేయడంతో ఒక్కసారిగా ఉధృత పరిస్థితి నెలకొన్నది. వివరాలుకెళ్తే ఓల్ మల్లాపూర్ లోని 109 సర్వే ఎస్ జి కే నాయుడు అనే వ్యక్తికి 1985లో రెవిన్యూ అధికారులు 120 గజాల పట్టాను ఎక్స్ సర్వీస్మెన్ కింద జారీ చేశారు. ఇట్టి 120 గజాలను నాయుడు తన వ్యక్తిగత అవసరాల కోసం మల్లాపూర్ లో నివా సముండే సూర్ణం శివకు అమ్మ వేశాడు.

ఇట్టి ల్యాండ్‌లో నిర్మాణాలు చేపట్టేందుకు ఉప్పల్ ఎమ్మార్వో ఆఫీస్ మరియు కాప్రా మున్సి పల్ అధికారులకు దరఖాస్తు చేసు కున్నాడు. 2023 97 గజాలకు కేసీఆర్ ప్రభుత్వంలో సూర్య శివపై అధికారులు మరొక పట్టాను జారీ చేశారు. ఈ క్రమంలో స్థానిక బిఆర్‌ఎస్ కార్పొరేటర్ ఇట్టి ప్లాట్‌లో నిర్మాణాలు చేప ట్టాలంటే 3 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు బాధి తులు తెలిపారు.

బుధవారం రోజున 109 సర్వే నెంబర్‌లోని ఉన్న ప్రభుత్వ భూమి 220 గజాల భూమి తో పాటు సూర్య శివ 97 గజాల కూడా పార్కు స్థలంగా శంకుస్థాపన చేసేందుకు అధికారులతో కార్పొ రేటర్ స్థానిక ఎమ్మెల్యే రావడంతో బాధి తుడు నిలదీశారు. పక్కన ఉన్న ప్రభుత్వ కి తన స్థలానికి ఎలాంటి సంబంధం లేదని 2023 కేసీఆర్ సర్కార్ కూడా తనకు పట్టా ఇచ్చిందని స్థానిక ఎమ్మార్వో ఇచ్చిన పంచనామ కాపీ ఉండంగా ఎలా పార్క్ స్థల మంటారంటూ వాగ్దానికి దిగారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నది ఎమ్మెల్యే స్థానిక పోలీస్ ఇన్స్పెక్టర్ నచ్చజెప్పే ప్రయత్నం చేయడంతో వివాదం ముగిసింది.

కార్పొరేటర్ బూతు పురాణంపై స్థానికులు ఆగ్రహం

తనకు డబ్బులు ఇవ్వలేదని తమ భూమిని పార్క్ స్థలంలో కలిపేందుకు కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని సూర్యశివారోపించారు. ఒక కార్పొరేటర్ అయి ఉం డి బూతులు మాట్లాడుతూ చిన్న స్థలాలను కూడా డబ్బులు డిమాండ్ చేయ డం సరికా దన్నారు. మల్లాపూర్ డివిజన్లోని ఏ నిర్మాణం చేపట్టిన కార్పొరే టర్ వాటాలు అడుగుతున్నారని పలుగురు స్థానికులు ఆరోపించారు. ఇటీ వల కాలంలో కూడా ఓ కాంట్రాక్టర్ కూడా కార్పొరేటర్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే ముందే కార్పొ రేటర్ బూతు పురాణం స్థానిక ప్రజలను ఆశ్చర్యాన్ని గురిచేసింది.