13-11-2025 12:00:00 AM
యాచారం, నవంబర్ 12 : ప్రతీ గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని డీసీసీబీ ఛైర్మన్ కొత్త కురుమ సత్తయ్య,అన్నారు. బుధవారం మండలంలోని నందివనపర్తి, చింతపట్ల, యాచారం గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను బుధవారం ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. వరి కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులకు తగిన ధర సమయానికి చెల్లింపులు ఉంటాయని రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.దళారులను ఆశ్రయించి మోసపోవద్దని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రాధా రాణి ఇబ్రహీంపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కంబాలపల్లి గురునాథ్ రెడ్డి , కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మస్క నరసింహ, బిఎన్‌ఆర్ ట్రస్ట్ చైర్మన్ బిలకంటి చంద్రశేఖర్ రెడ్డి, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.