మేడ్చల్ కలెక్టరేట్ ఎదుట ఉద్రిక్తత
- ప్రభుత్వ విద్యా సంస్థల్లో సౌకర్యాలపై ఏబీవీపీ ధర్నా
- లోనికి చొచ్చుకెళ్లేందుకు యత్నం.. అడ్డుకున్న పోలీసులు..
మేడ్చల్, జూన్ 12 (విజయక్రాంతి): మేడ్చల్ కలెక్టరేట్ ఎదుట శుక్రవారం ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వ విద్యా సంస్థలలో సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. విద్యా సంస్థలలో కనీస సౌకర్యాలు కల్పించాలని నినాదాలు చేస్తూ, ఏబీవీపీ కార్యకర్తలు కలెక్టరేట్ లోపలికి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. అప్పటికే అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
పోలీసులు గేట్లు బంద్ చేసి రాకపోకలు నిలిపివేశారు. ఏబీవీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకుని శామీర్‌పేట్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ ప్రతినిధులు మాట్లాడుతూ.. విద్యాసంస్థలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదన్నారు. విద్యాశాఖ ముఖ్యమంత్రి వద్దనే ఉన్నప్పటికీ పట్టించుకోవ డంలేదని విమర్శించారు.






