calender_icon.png 29 July, 2025 | 9:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆత్మహత్య చేసుకున్న పదో తరగతి విద్యార్థి

29-07-2025 11:56:38 AM

పాఠశాల ఎదుట ఆందోళన 

మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని అభ్యాస్ స్కూల్ లో 10వ తరగతి(Tenth grade student ) చదువుతున్న తిరుమలగిరి మండలం వెలిశాల గ్రామం మర్రికుంట తండాకు చెందిన వెంకట చైతన్య(16) అనే విద్యార్థి ఎలుకల మందు తిని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చైతన్య మరణానికి పాఠశాల యాజమాన్యం కారణమని ఆరోపిస్తూ విద్యార్థి మృత దేహాన్ని స్కూల్ ముందు పెట్టి కుటుంబ సభ్యులు, బంధువులు, తండా వాసులు ఆందోళనకు దిగారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని  ఘటనపై దర్యాప్తు చేపట్టారు.