29-07-2025 11:58:57 AM
కుమ్రం భీం ఆసిఫాబాద్(విజయక్రాంతి): సాంఘిక సంక్షేమ గురుకులాల కార్యదర్శి(Secretary of Gurukuls) అలుగు వర్షిణి ఆదేశాల మేరకు సాంఘీక సంక్షేమ బాలుర, బాలికల గురుకుల కళాశాలల్లో మిగిలిపోయిన సీట్లకు రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 31 న స్పాట్ అడ్మిషన్ కౌన్సిలింగ్ నిర్వహించనున్న సందర్భంగా జిల్లాలోని సాంఘీక బాలుర, బాలికల కళాశాలైన ఆసిఫాబాద్ బాలురు ఎంపీసి, బైపిసి గ్రూపులు, కాగజ్ నజర్ బాలికలు: ఎంపీసి, బైపిసి గ్రూపులు, రెబ్బేన బాలికలు: ఎంపీసి, బైపిసి గ్రూపులు, సిర్పూర్ బాలురు: ఎంఈసి, సిఈసి గ్రూపులు, సిర్పూర్ బాలికలు: ఎమ్ఈసి, సిఈసి గ్రూపుల్లో మిగిలిపోయిన సీట్లకు స్పాట్ అడ్మిషన్, కౌన్సిలింగ్ జరుగుతుందని సాంఘిక సంక్షేమ గురుకులాల జిల్లా సమన్వయ అధికారి జూలూరి యాదగిరి ప్రకటనలో తెలిపారు.
ఆసక్తిగల విద్యార్థులు తమ మార్చి 2025 పదవతరగతి ఒరిజినల్ టీసీ, బోనాఫైడ్, కుల ఆదాయ సర్టిఫికెట్లతో ఆయా కళాశాలలకు ఉదయం.9 గంటల నుండి మధ్యాహ్నం 1గంట వరకు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మధ్యాహ్నం 2గంటలకు కౌన్సిలింగ్ నిర్వహించి, సీట్ల కేటాయింపు రిజర్వేషన్ , మెరిట్ ఆధారంగా కేటాయింపు ఉంటుందని సాంఘీక సంక్షేమ గురుకులాల జిల్లా సమన్వయ అధికారి స్పష్టం చేశారు. జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలల ప్రిన్సిపల్ ఫోన్ నెంబర్ లు ఆసిఫాబాద్ బాలురు: 9704550162, సిర్పూర్ బాలురు: 8008003626, సిర్పూర్ బాలికలు: 7675010586, కాగజ్ నగర్ బాలికలు: 7995010573, రెబ్బేన బాలికలు: 7995010577 నెంబర్ లను సంప్రదించాలని తెలిపారు.