పదవ తరగతి విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
19-05-2026 01:09 AM
తాడ్వాయి, మే, 18( విజయ క్రాంతి ): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని మా గార్డెన్ లో సోమవారం 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు. 1994- 95 బ్యాచ్ కు చెందిన పదవ తరగతి విద్యార్థులు అందరూ ఆత్మీయంగా కలుసుకొని ఒకరికొకరు పలకరింపులు చేసుకున్నారు.
తమ గురువులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..31 సంవత్సరాల తర్వాత ఒకరికొకరం కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. చిన్ననాటి స్నేహం, ఆనాటి జ్ఞాపకాలు ఎప్పటికీ మర్చిపోలేమని తెలిపారు. ఈ కార్యక్రమంలో 1994-95 10వ తరగతి విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.






