19 May, 2026 | 4:17 AM

క్రీడల్లో గెలుపు ఓటములు సహజమే..

19-05-2026 01:08 AM

ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి

బాన్సువాడ, మే 18 (విజయ క్రాంతి): క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని, ఓడిన వారు నిరాశ చెందకుండా మళ్లీ గెలుపు కోసం ప్రయత్నించాలని ప్రభుత్వ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో సీనియర్ కబడ్డీ క్రీడాకారుల ఆధ్వర్యంలో కెపిఎల్ కబడ్డీ టోర్నమెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ టోర్నమెంట్ను కో-ఆప్షన్ మెంబర్ సిహెచ్ రాజు, గౌస్ ఆర్గనైజ్ చేశారు. ఆదివారం రాత్రి ముగింపు కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథులుగా ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజులు హాజరై గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులను అందజేశారు.

ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడానికి, వారిలో ఉన్న ప్రతిభను వెలికి తీయడానికే బాన్సువాడలో మినీ స్టేడియం ఏర్పాటు చేశామని అన్నారు. ఈ స్టేడియం వల్ల క్రీడాకారులకు మంచి వేదిక లభించిందని తెలిపారు. అన్ని రకాల క్రీడలను ఇక్కడ ప్రాక్టీస్ చేసి రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో గెలుపొంది బాన్సువాడకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ విట్టల్ రెడ్డి పట్టణ సిఐ తుల శ్రీధర్ నాయకులు శంభు రెడ్డి, ఏజాజ్,కృష్ణారెడ్డి, గౌస్, నరసన్న చారి పీఈటీలు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.