అరుంధతీరాయ్‌పై టెర్రర్ విచారణ
అనుమతి ఇచ్చిన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్
న్యూఢిల్లీ, జూన్ 14: ప్రముఖ రచయిత్రి, పౌరహక్కుల ఉద్యమకారిణి అరుంధతీరాయ్‌పై అత్యంత కఠినమైన ఉగ్రవాద వ్యతిరేక చట్టం కింద విచారణ ప్రారంభించేందుకు ఢిల్లీ లెఫ్టి నెంట్ గవర్నర్ వీకే సక్సేనా అనుమతి ఇచ్చా రు. కశ్మీర్‌కు సంబంధించిన సెమినార్‌లో అరుంధతి 2010లో వివాదాస్పద వ్యాఖ్యలు చేయటంతో ఆమెపై యూఏపీఏ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇదే విషయంలో సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కశ్మీర్ మాజీ ప్రొఫెసర్ షేక్ షౌకత్ హుస్సేన్‌పై కూడా కేసు నమోదైంది. 2010 అక్టోబర్ 28న సుశీల్ పాండే అనే వ్యక్తి ఫిర్యాదు చేయటంతో ఢిల్లీలోని మెట్రోపాలిటన్ కోర్టులో వీరిపై ఎఫ్‌ఐర్ నమోదుచేశారు.
ఒక పబ్లిక్ ఫంక్షన్‌లో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. వారిపై కేసును నమోదు చేయాలని స్పష్టం చేశారు. నిషేధిత ఆజారీ సంస్థ నిర్వహించిన సదస్సులో భారత్‌ను నుంచి కశ్మీర్‌ను విడదీయాలని రాయ్, హుస్సేన్ పిలుపునిచ్చారని రాజ్‌భవన్ వర్గాలు తెలిపాయి. వీరిపై సీఆర్పీసీ సెక్షన్ 196, ఐపీసీ 153ఏ సెక్షన్ల కింద విచారణ ప్రారంభించేందుకు లెఫ్టినెంట్ గవర్నర్ శుక్రవారం అనుమతి ఇచ్చారు. అయితే ఈ నిర్ణయంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. అరుంధతీ, షౌకత్‌కు తమ మద్దతు తెలిపారు.






