ఉగ్రమూకను ఏరేయాల్సిందే!
- పూర్తిస్థాయి వనరులు వినియోగించండి
ఒక్క ఉగ్రవాది కూడా మిగలకూడదు
ప్రధాని నరేంద్రమోదీ ఆదేశాలు
కశ్మీర్‌లో వరుస ఉగ్రదాడులపై ఆగ్రహం
ఎన్‌ఎస్‌ఏగా దోవల్ పునర్నియామకం
ప్రధాని ప్రధానకార్యదర్శిగా పీకే మిశ్రా
న్యూఢిల్లీ, జూన్ 13: జమ్ముకశ్మీర్‌లో కొన్నిరోజులుగా వరుసగా ఉగ్రవాద దాడు లు జరుగుతుండటంపై ప్రధాని నరేంద్రమోదీ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉగ్రవాదు లను ఏరివేసేందుకు వనరులన్నింటినీ వినియోగించుకోవాలని భద్రతాబలగా లను ఆదేశించారు. భారత భూభాగంలో ఉగ్రవాదులు ఉండటానికి వీళ్లేదని స్పష్టంచేశారు. వరుస ఉగ్రదాడులపై ప్రధాని గురువారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
భద్రతాబలగాలు ఉగ్రవాదులకు గట్టిగా జవాబు ఇస్తున్నాయని ప్రశంసించారు. ఉగ్రవాద వ్యతిరేక బలగాలు, వనరులను పూర్తిగా వినియోగించుకొని ముష్కర మూకలను ఏరివేయాలని ఆదేశించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కూడా మాట్లాడి కశ్మీర్‌లో బలగాల మోహరింపుపై వాకబు చేశారు. ఉగ్రవాదులను ఏరివేయటంతో బలగాలకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్టు ప్రకటించారు.
వరుస దాడులు
లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వచ్చినరోజే జమ్ముకశ్మీర్‌లో ఉగ్రదాడులు మొదలయ్యాయి. నాలుగో తేదీన రియాసీ జిల్లాలో తీర్థయాత్రికుల బస్సుపై ఉగ్రవాదులు మెరుపుదాడి చేయటంతో 9 మంది మరణిం చారు. 41 మంది గాయపడ్డారు. రెండు రోజుల తర్వాత దోడాలోని మిలిటరీ చెక్‌పోస్టుపై దాడి చేశారు. ఈ దాడిలో ఆరుగురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. అదే రోజు రాత్రి కథువా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ సీఆర్పీఎఫ్ జవాన్‌తోపాటు ఒక ఉగ్ర వాది మరణించాడు. దోడా జిల్లాలోని కోటా కొండప్రాంతంలో బుధవారం సా యంత్రం జరిగిన ఎన్‌కౌంటర్లలో ఓ పోలీస్ గాయపడ్డాడు. దీంతో ఉగ్రవాదులను ఏరివేసేందుకు సైన్యం, పారామిలిటరీ, జమ్ముకశ్మీర్ పోలీసులు సంయుక్త ఆపరేషన్లు చేపట్టారు.
ఎన్‌ఎస్‌ఏగా దోవల్
జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ)గా అజిత్‌దోవాల్ మూడోసారి నియమితులయ్యారు. ఆయనను ఆ పదవిలో పునర్నియమించినట్టు కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రకటించింది. కేంద్ర క్యాబినెట్ అపాయింట్‌మెంట్స్ కమిటీని కూడా పునర్నియమించి నట్టు తెలిపింది. ప్రధానమంత్రి ప్రిన్సిపల్ కార్యదర్శిగా పీకే మిశ్రాను నియమించినట్టు వెల్లడించింది.
పదేండ్లుగా మోదీ వెంటనే
అజిత్ దోవల్ 1968 బ్యాచ్ ఐపీఎస్ అధికారి కాగా, పీకే మిశ్రా 1972 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. వీరిద్దరూ గత పదేండ్లుగా ప్రధానమంత్రి మోదీకి రెండు కండ్లుగా మెలుగుతున్నారు. ఎన్‌ఎస్‌ఏగా అజిత్‌దోవల్ జాతీయ భద్రత, సైన్యం, ఇంటెలిజెన్స్ వ్యవహారాలు పర్యవేక్షిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ కార్యదర్శిగా పదవీ విరమణ చేసిన పీకే మిశ్రా.. గత పదేండ్లుగా పీఎంవో వ్యవహారాలను చక్కబె డుతున్నారు. వీరిద్దరూ పదవీ విరమణ చేసిన అధికారులే. 2014లో ప్రధాని పదవి చేపట్టకముందు నుంచే వీరితో మోదీకి మంచి సంబంధాలు ఉన్నట్టు చెప్తారు. ఆయన తొలిసారి ప్రధాని పదవి చేపట్టగానే దోవల్‌ను ఎన్‌ఎస్‌ఏగా నియమించారు. అప్పటి నుంచి ఆయన అదే పదవిలో కొనసాగుతున్నారు. ఉగ్రవాద అణచివేత కార్యక్ర మాల్లో దోవల్‌కు మంచి అనుభవం ఉన్నది. ఆయన ఉద్యోగంలో ఉండగా, దాదాపు పదేండ్లు పాకిస్థాన్‌లో భారత ఏజెంటుగా రహస్యంగా పనిచేశారు.






