calender_icon.png 10 May, 2025 | 2:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పర్యాటకులపై ఉగ్రవాదుల కాల్పులు పిరికిపందల చర్య

24-04-2025 12:06:17 AM

హైదరాబాద్ సిటీబ్యూరో (విజయక్రాంతి): జమ్మూ కాశ్మీర్‌లో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన కాల్పులు పిరికిపందల చర్య అని కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి స్కైలాబ్‌బాబు, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు, కోట రమేష్, ఆనగంటి వెంకటేశ్, హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఎండీ జావీద్, టీపీఎస్‌కే రాష్ట్ర కార్యదర్శి భూపతి వెంకటేశ్వర్లు, అన్నారు. పర్యాటకులపై ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ బుధవారం డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో కొవ్వత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే సంస్థలను దేశం నుంచి తరిమికొట్టాలన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామెర కిరణ్, వివిధ సంఘాల నాయకులు మనోహర్, విజయ్, పవన్, హస్మిత, వినయ్‌ తదితరులు పాల్గొన్నారు.