calender_icon.png 2 May, 2025 | 4:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మే డే కరపత్రం ఆవిష్కరించిన ఎమ్మెల్యే

24-04-2025 01:16:21 AM

కరీంనగర్, ఏప్రిల్ 23 (విజయ క్రాంతి): బీఆర్‌టీయూ అనుబంధ సంఘం తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ సంఘం రూపొందించిన మే డే సభ పోస్టర్ ను బుధవారం  మాజీ మంత్రి,  కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో  బి ఆర్ టి యు జిల్లా అధ్యక్షులు బొమ్మిడి శ్రీనివాస్ రెడ్డి, మాజీ కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, మాజీ జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యులు జమీలుద్దీన్, సంఘం జిల్లా అధ్యక్షులు బొంకూరు రాములు, కొత్తపల్లి మండల అధ్యక్షులు కత్తెరపాక ఎల్లయ్య, సభ్యులు లక్ష్మణ్, వెంకటస్వామి, చంద్రయ్య, ఎల్లయ్య, ఆశీర్వాదం, శంకర్, పలువురు సంఘ బాధ్యులు, తదితరులు పాల్గొన్నారు.