22 March, 2026 | 12:05 AM

ప్రశాంతంగా టెట్: కలెక్టర్

09-01-2026 12:12 AM

భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 8 (విజయక్రాంతి): టెట్2026 పరీక్షల నిర్వహణలో భాగంగా, గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని, అబ్దుల్ కలాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నలాజికల్ సైన్సెస్లో నిర్వహించిన ,టెట్ పరీక్షలు ప్రశాంతంగా, సజావుగా ముగిసినట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు. ఈ పరీక్షా కేంద్రంలో సెషన్‌Iకు మొత్తం 100 మంది అభ్యర్థులు కేటాయించగా, అందులో 87 మంది హాజరై 13 మంది గైర్హాజరయ్యారని తెలిపారు.

అదే విధంగా సెషన్‌IIకు 100 మంది అభ్యర్థులు కేటాయించబడగా, 56 మంది హాజరై 44 మంది గైర్హాజరయ్యారని కలెక్టర్ వివరించారు. రెండు సెషన్లలోనూ పరీక్షలు ఎలాంటి అవాంతరాలు లేకుండా ప్రశాంత వాతావరణంలో, నిర్వహించబడినట్లు తెలిపారు. పరీక్షా నియమ నిబంధనలు కట్టుదిట్టంగా అమలు చేసినట్లు తెలిపారు. అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించామని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ స్పష్టం చేశారు.