09-01-2026 12:13:21 AM
జైనూర్, జనవరి ౮ (విజయక్రాంతి): మార్లవాయి గ్రామ అభివృద్ధిపై అసత్య ప్రచారం చేస్తే సహించబోమని మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కనక యాదవరావు హెచ్చరించారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే గ్రామంలో వాస్తవ అభి వృద్ధి జరిగిందని, అభివృద్ధి జరగలేదని చెప్పడం ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నమని మండిపడ్డారు. త్రాగునీటి సౌకర్యం, సీసీ రోడ్లు, ట్యాంక్బండ్, ఆశ్రమ పాఠశాలల్లో అదనపు గదుల నిర్మాణం వంటి కీలక పనులతో గ్రామ రూపురేఖలు మారాయని తెలిపారు.
హైమాన్ డార్ఫ్‌బెట్టి ఎలిజబెత్ పేరిట కమ్యూనిటీ భవనం నిర్మాణం, గుస్సాడి కళాకారుడికి ఆర్థిక సహాయం వంటి చర్యలు బిఆర్‌ఎస్ సంకల్పానికి నిదర్శనమన్నారు. ఇటీవల కేవలం 91 లక్షలు కేటాయించగానే అభివృద్ధి చేసినట్లు చెప్పడం హాస్యాస్పదమని విమర్శించారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సోనేరావు, రాంషావ్, మెస్రం మారతి, పరచ హన్మంత్ రావు, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.