09-01-2026 12:11:51 AM
సీఎం కప్ క్రీడా జ్యోతి ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్ రాజర్షిషా
ఆదిలాబాద్, జనవరి 8 (విజయక్రాంతి): ‘రూరల్ టు గ్లోబల్’ నినాదంతో గ్రామీణ స్థాయి క్రీడాకారులను రాష్ట్ర, జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే సీఎం కప్ లక్ష్యమని జిల్లా కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కప్ 2025 (రెండో ఎడిషన్) క్రీడా పోటీల ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రీడా జ్యోతి (టార్చ్ రిలే) ర్యాలీ ని గురువారం అట్టహాసంగా నిర్వహించారు. కలెక్టర్ క్రీడా జ్యోతి వెలిగించి, పచ్చజెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఇందిరా ప్రియదర్శిని స్టేడి యం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ స్థానిక కొమురం భీం కూడలి వరకు కొనసాగింది. అనంతరం విద్యార్థులు మానవహారం ప్రదర్శించి అందరి దృష్టిని ఆకర్షించారు.
ఈ సంద ర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... గ్రామీణ, పట్ట ణ ప్రాంతాల్లోని యువ క్రీడాకారులలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకే ప్రభు త్వం సీఎం కప్ పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని తెలిపారు. జిల్లాలోని యువత పెద్ద సంఖ్యలో ఈ పోటీల్లో పాల్గొని తమ క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించాలని పిలుపునిచ్చారు. చదువుతో పాటు క్రీడలకు సమాన ప్రాధా న్యం ఇవ్వాలని విద్యార్థులకు సూచించారు. క్రీడల్లో గెలుపు, ఓటములు సహజమని, గెలవడమే కాదు పాల్గొనడమే ముఖ్యమని అన్నా రు. సీఎం కప్ పోటీలను ఈ నెల 17 నుంచి 22 వరకు గ్రామీణ స్థాయిలో, 28 నుంచి 31 వరకు మండల స్థాయిలో, ఫిబ్రవరి 3 నుంచి 7 వరకు నియోజకవర్గ స్థాయిలో, 10 నుంచి 14 వరకు జిల్లా స్థాయిలో నిర్వహించనున్నట్లు తెలిపారు.
రాష్ట్ర స్థాయి పోటీలను ఫిబ్రవరి 19 నుంచి 26 మ ధ్య నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మొత్తం 44 క్రీడాంశాలలో పోటీలు జరుగుతాయని వివరించారు. గత సీఎం కప్ పోటీల్లో జిల్లా విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో మెరుగైన ప్రతిభ కనబరిచి పతకాలు సాధించడం గర్వకారణమని తెలిపారు. క్రీడలను జీవితంలో భాగం చేసుకోవడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యంతో పాటు వ్యక్తిత్వ వికాసం సాధ్యమవుతుందని అన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లలను క్రీడల్లో ముందుకు తీసుకెళ్లే లా ప్రోత్సహించాలని సూచించారు. సీఎం కప్ పోటీలను సమన్వయంతో విజయవంతం చేయాలని అధికారు లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు శ్యామలాదేవి, రాజేశ్వర్, శిక్షణ కలెక్టర్ సలోని చబ్రా, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి శ్రీనివాస్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్, ఎల్డిఎం ఉత్పల్ కుమార్, వివిధ శాఖల అధికారులు, క్రీడా కోచ్లు, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు పాల్గొన్నారు.