19 April, 2026 | 8:00 AM

స్క్రాప్ దుకాణంలో పాఠ్యపుస్తకాలు!

28-06-2024 01:03 AM
  1. డీటీడీవో కార్యాలయ ఉద్యోగి కక్కుర్తి
  2. ఇద్దరు ఉద్యోగుల తొలగింపు

నాగర్‌కర్నూల్, జూన్ 27 (విజయక్రాంతి): ‘కాదేది సొమ్ము చేసుకునేం దుకు అనర్హం’ అన్నట్లు ఓ ఉద్యోగి చిల్లర పైసలకు ఆశ పడింది. పాఠ్యపుస్తకాలను భర్తతో గుట్టుగా బయటకు మళ్లించింది. చివరికి తన ఉద్యోగంతో పాటు మరో ఉద్యోగి కొలువుకూ ఎసరు పెట్టింది. అచ్చంపేట పట్టణం ఉట్ల కోనేరు  ప్రాంతంలోని ఓ పాత ఇనుప సామగ్రి దుకాణంలో గురువారం స్థానికులు సీల్ తీ యని పాఠ్యపుస్తకాలను గుర్తించారు. అవి గత విద్యాసంవత్సరానికి సంబంధించిన 6 నుంచి 10వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం పాఠ్యపుస్తకాలుగా నిర్ధారించారు.

వెంటనే పోలీసుల కు సమాచారం ఇవ్వడంతో వారు దుకాణాని కి వచ్చారు. మొత్తం 45 పాఠ్య పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. జిల్లాకేంద్రంలోని డీటీడీవో కార్యాలయ ఉద్యోగి దానమ్మ గుట్టు గా పాఠ్యపుస్తకాలను బయటకు మళ్లించిందని, ఆమె భర్త శంకర్‌తో వాటిని పాత ఇనుప దుకాణానికి చేర్చి సొమ్ము చేసుకున్నదని పోలీసులు నిర్ధారించారు. దీంతో డీటీడీవో కమలా కర్ స్పందించారు. ఉద్యోగి దానమ్మతో పాటు పాఠ్యపుస్తకాలను పర్యవేక్షించడంలో విఫలమైన మరో ఉద్యోగి కాశన్నను విధుల నుంచి తొలగించారు. అలాగే ఏసీఎంవో తిరుపతయ్యకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు.