31 July, 2026 | 7:59 AM

కలెక్టరేట్ బతుకమ్మ సంబరాల్లో టీజీ ఐఐసి చైర్ పర్సన్ నిర్మల జగ్గారెడ్డి

26-09-2025 12:09 AM

సంగారెడ్డి,(విజయక్రాంతి): గురువారం కలెక్టరేట్ లో నిర్వహించిన అటుకుల బతుకమ్మ ఉత్సవాలు అట్టహాసంగా జరిగాయి. బతుకమ్మ కేవలం పండుగ మాత్రమే కాదు తెలంగాణ అస్తిత్వానికి సంస్కృతికి ప్రతీక గా నిలిచిందని, మహిళల  సామాజిక కలయికను ప్రోత్సహిస్తుందని  టిజిఐఐసి చైర్ పర్సన్ నిర్మల జగ్గారెడ్డి అన్నారు. జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై, పూలతో అలంకరించి గౌరమ్మకు పూజలు చేసి  అటుకుల బతుకమ్మ సంబురాలను ప్రారంభించారు.

పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద టిఎన్జిఓస్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలకు ఘనంగా  ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టిజిఐఐసి చైర్ పర్సన్ నిర్మల జగ్గారెడ్డి హాజరు అయి మహిళ ఉద్యోగులతో కలసి నిర్మల జగ్గారెడ్డి బతుకమ్మ ఆడారు. అనంతరం మహిళ ఉద్యోగులు నిర్మల జగ్గారెడ్డిని సన్మానించారు. మహిళలందరూ బతుకమ్మ పండుగను సంతోషంగా జరుపుకోవాలని వారు ఆకాక్షించారు.