26-09-2025 12:08:29 AM
హైదరాబాద్, సెప్టెంబర్ 25 (విజయక్రాం తి): స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీమంత్రి హరీశ్ సూచిం చారు. పార్టీ నేతలతో గురువారం కేటీఆర్, హరీశ్‌రావు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఒకటి రెండు రోజుల్లో షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో పార్టీ ఇంచార్జులను అప్రమత్తం చేశారు. క్షేత్రస్థాయిలో సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేయాలని నియోజకవర్గ ఇన్‌చార్జులను ఆదేశించారు.
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. అందరితో మమేకమై ఉండే గెలుపు గుర్రాలకు పోటీకి అవకాశం కల్పించేలా చూడాలని సూచించారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, ప్రజలు బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ వైపు చూస్తున్నారని తెలిపారు. స్థానిక సమస్యలపై దృష్టిపెట్టాలని పార్టీ క్యాడర్‌కు పిలుపునిచ్చారు.
హామీలు అమలు చేయకపోవడం, ప్రభుత్వ వైఫల్యాలు, స్థానిక సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. బతుకమ్మ పండుగకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయలేదని, తెలంగాణ సంస్కృతి పట్ల కాంగ్రెస్ నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని కేటీఆర్ ఆరోపించారు. స్థానికంగా బీఆర్‌ఎస్ నేతల ద్వారా బతుకమ్మ కో సం ఏర్పాట్లు చేసేలా చూడాలని సూచించారు.