calender_icon.png 29 January, 2026 | 4:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూడు టెండర్లకు టీజీఐఐసీ ఆహ్వానం

29-01-2026 12:59:50 AM

రూ.27.46 కోట్ల విలువైన అభివద్ధి పనులకు నోటిఫికేషన్ జారీ

మహబూబ్‌నగర్‌కు 11.18, మెదక్‌కు రూ.2.37, రంగారెడ్డి జిల్లా హార్డ్‌వేర్ పార్క్--ఫేజ్---3కి 13.91 కోట్ల చొప్పున కేటాయింపు

హైదరాబాద్, జనవరి 28 (విజయక్రాంతి) : తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్(టీజీఐఐసీ) మూడు కీలక అభివృద్ధి పనులకు సంబంధించి టెండర్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. చీఫ్ ఇంజనీర్ కార్యాలయం నుంచి జారీ చేసిన ఈ టెండర్ నోటీస్ నంబర్లు 59, 60, 61 (2025-26) కింద మొత్తం సుమారు రూ. 27.46 కోట్ల అం చనా వ్యయంతో పనులు చేపట్టనున్నారు. ఈ టెండర్లలో భాగంగా మహబూబ్‌నగర్‌లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ కోసం కొత్త బ్రాంచ్ ఆఫీస్ భవనం నిర్మించనున్నారు.

ఈ పనికి అంచనా వ్యయం రూ. 11.18 కోట్లుగా నిర్ణయించారు. దీంతో జిల్లా కేంద్రం లో ఆర్థిక సంస్థలకు మౌలిక వసతులు మెరుగుపడతాయని అధికారులు చెబుతున్నారు. అలాగే మెదక్ జిల్లా మనోహరాబాద్ మం డలం కొండాపూర్ గ్రామంలో ముప్పిరెడ్డిపల్లి జంక్షన్ నుంచి ఐపీ-- కొండాపూర్ ప్రవేశద్వారం వరకు ఉన్న ప్రస్తుత బీటీ రోడ్డును వెడల్పు చేసి బలోపేతం చేయనున్నారు. ఈ రహదారి అభివృద్ధి పనులకు రూ.2.37 కోట్లు అంచనా వేశారు. దీంతో పరిశ్రమల ప్రాంతానికి రవా ణా సౌకర్యం మరింత మెరుగవుతుందని భావిస్తున్నారు.

మరోవైపు రంగారెడ్డి జిల్లా హార్డ్‌వేర్ పార్క్--ఫేజ్-- లోని సైన్స్ అండ్ టెక్నాలజీ పార్క్‌లో అంతర్గత రోడ్లు, స్టార్మ్ వాటర్ డ్రెయి న్ నిర్మాణానికి కూడా టెండర్ నోటిఫికేషన్ విడుదలైంది. వెట్ మిక్స్ మెకడమ్, బ్లాక్ టాపింగ్‌తో చేపట్టే ఈ పనులకు రూ. 13.91 కోట్లుఅంచనా వ్యయం నిర్ణయించారు. ఈ ప్రాజెక్టుతో హార్డ్‌వేర్ పార్క్‌లో మౌలిక సదుపాయాలు మరింత బలోపేతం కానున్నాయి. ఈ మూడు టెండర్లకు సంబంధించిన బిడ్లు జనవరి 27, 2026 సాయంత్రం 5 గంటల నుంచి డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులోకి వచ్చాయి.

బిడ్లు సమర్పించేందుకు చివరి తేదీగా ఫిబ్రవరి 11, 2026 మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు నిర్దేశించారు. పూర్తి వివరాలతో కూడిన టెండర్ డాక్యుమెంట్లు www.tender.telangana.gov.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నట్టుటీజీఐఐసీ అధికారులు తెలిపారు. ఈ టెండర్ల ద్వారా రాష్ర్టంలో పరిశ్రమల మౌలిక వసతులు, రహదారి అనుసంధానం మరింత బలోపేతం అవుతాయని, పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఏర్పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.