calender_icon.png 29 January, 2026 | 2:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అవినీతి కేంద్రంగా జగిత్యాల

29-01-2026 01:02:13 AM

  1. ఏసీబీ దాడులు, విజిలెన్స్ విచారణేఎమ్మెల్యే సంజయ్ చేసిన అభివృద్ధా?
  2. మాజీ మంత్రి జీవన్‌రెడ్డి ధ్వజం

కోరుట్ల/జగిత్యాల, జనవరి 28 (విజయక్రాంతి): జగిత్యాల మున్సిపాలిటీని ఎమ్మెల్యే సంజయ్ బ్రష్ఠు పట్టించారని మాజీ మంత్రి జీవన్‌రెడ్డి విమర్శించారు. జగిత్యాలను అవినీతి కేంద్రంగా మార్చారని, ఏసీబీ దాడులు, విజిలెన్స్ విచారణలే ఎమ్మెల్యే సంజయ్ అభివృద్ధికి నిదర్శనం అని అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో గల ఇందిరా భవన్‌లో బుధవారం మీడియా సమావేశంలో జీవన్‌రెడ్డి మాట్లాడారు. మున్సిపల్ చైర్‌పర్సన్ సీటు ఖాళీ అయితే చట్టంలో లొసుగులు ఆసరాగా చేసుకొని బలహీనవర్గాల హక్కులను కాజేశారని మండిపడ్డారు.

ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ప్రారంభించి రెండేళ్లు కావస్తున్నా ఎందుకు వినియోగంలోకి తీసుకురాలేదని ప్రశ్నించారు. పది సంవత్సరాలు అధికారంలో ఉండి కూడా అభివృద్ధిని పట్టించుకోలేదని, ఉన్నది మాట్లాడితే ఉలికెందుకని ఎమ్మెల్యే సంజయ్‌పై ఫైర్ అయ్యారు. గత ఐదు సంవత్సరాల మున్సిపల్ పాలకమండలి పదవీకాలంలో 16 మంది కమిషనర్లు మారటం దేశంలోనే ఎక్కడా ఈ పరిస్థితి ఉండదన్నారు. కమిషనర్లు పనిచేయలేదని పంపించారా? ఎనిమిది మంది ఉద్యో గులు జైలు పాలు కావడం మీ పుణ్యం కాదా? అని ప్రశ్నించారు.

‘మీరు ఎన్నుకున్న మీ పార్టీ చైర్‌పర్సన్ వేధింపులు తట్టుకోలేక మానసిక క్షోభతో రాజీనామా చేయడం కళ్ల ముందు జరిగింది. బలహీన వర్గాలకు చెందిన సీట్ ఖాళీ అయితే భర్తీ చేసే ప్రయత్నం చేయాల్సి ఉన్నా ఆ దిశగా కనీస ప్రయత్నం ఎందుకు చేయలేదు. అసెంబ్లీలో సవరణ అవసరం లేకుండా కేవలం పాలనా పరమైన సవరణతో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో రావడంతో నా వంతు బాధ్యతగా సీఎం రేవంత్‌రెడ్డి దృష్టి కి తీసుకెళ్లి బలహీన వర్గాలకు కేటాయించిన సీట్లు భర్తీ చేయించిన. మీరు చట్టాలలో లొసుగులను ఆసరాగా చేసుకొని హక్కులు కాజేస్తు న్నారు.

వైస్ చైర్మన్ లేకుంటే ప్రభుత్వం నామినేటెడ్ చేస్తుందని ఎల్‌ఎల్‌గార్డెన్ రోడ్డు నిజా మాబాద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా అవుతుంది. రోడ్డు పక్కన ఉన్న నిరుపేదలకు కనీ సం రెండు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయి స్తే ఇల్లు తొలగిస్తామని చెప్పి కనీసం ఇల్లు కేటాయించలేదు. పైగా నేను అడ్డుకుంటున్నా ను అని ఆరోపణలు చేయడం హాస్యాస్పదం’ అన్నారు. 100 ఫీట్ల విస్తరణకు ప్రభుత్వానికి నివేదిస్తే కాంగ్రెస్‌కు ఎక్కడ పేరు వస్తదో అని తొక్కి పెట్టారని ఆరోపించారు.

అమ్మ ఆదర్శ పాఠశాలకు మునిసిపల్ నుండి 35 లక్షల ఖర్చు చేసే వినియోగంలోకి తీసుకురాలేదు ఎందుకని ప్రశ్నించారు. చిన్న కాంట్రాక్టర్ల బిల్లు రాకపోతే మీకు బాధ లేదా అని ప్రశ్నించారు. జగిత్యాలలో నిత్యం తాగునీరు సరఫరా చేయ డం కోసం వైఎస్‌ఆర్‌కు విజ్ఞప్తి చేయడంతో 2004లో 60 కోట్ల బడ్జెట్‌తో రూ.25 కోట్లు మంజూరు చేశారని, వాటితో చేపట్టిన నిర్మించడంతో ఇప్పుడు అదే వాటర్ సప్లై చేస్తున్నా రని చెప్పారు. 

‘పెట్రోల్ బంక్ అక్రమ నిర్మాణాలు తొలగించాలని కోర్టు చెప్పింది వాటిని పట్టించుకో వాలి. అక్రమ నిర్మాణాలను తొలగించు నిర్మాణాత్మకంగా అభివృద్ధి చేయాలని కోరుతు న్నాం’ అని అన్నారు. ఎమ్మెల్యే సంజయ్‌కు మార్ వాఖ్యలపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా.. ‘ఏసీబీ అధికారుల దాడులు, విజిలెన్స్ విచారణ, పోలీస్ ప్రజాప్రతినిధుల అనుమతితో చేస్తారా? జగిత్యాలలో జరిగే విచారణలు అన్నీ మీ అనుమతితోనే జరుగుతున్నాయని భావించాలి’ అని అన్నారు.