3 June, 2026 | 1:27 AM

స్పిన్ కోచ్‌గా సాయిరాజ్ బహుతులే

03-06-2026 12:51 AM

ఆప్ఘనిస్థాన్‌తో టెస్టుకు బాధ్యతలు

ముంబై, జూన్ 2 : భారత క్రికెట్ జట్టు కొత్త స్పిన్ కోచ్‌గా మాజీ లెగ్ స్పిన్నర్ సాయిరాజ్ బహుతులే నియమితుడయ్యాడు. ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ స్పిన్ బౌలింగ్ కోచ్‌గా వ్యవహరించిన సాయిరాజ్ బహుతులేకు మంచి పేరుంది. దేశీయ క్రికెట్‌లో దిగ్గజ ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొంది న బహుతులేకు ఆటగాడిగా, కోచ్‌గా విశేష అనుభవం ఉంది.

ముఖ్యంగా యువ స్పిన్నర్లను తీర్చిదిద్దడంలో, వారి ప్రతిభను మెరు గుపరచడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ నేపథ్యంలో భారత జట్టు స్పిన్ విభాగాన్ని మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో బీసీసీఐ ఈ బాధ్యతలను అప్పగించింది. బహుతులే భారత్ తరఫున రెండు టెస్టులు, ఎనిమిది వన్డేలు ఆడాడు. దాదాపు రెండు దశాబ్దాల పాటు సాగిన ఫస్క్‌క్లాస్ కెరీర్లో 6,176 పరుగులతో పాటు 630 వికె ట్లు సాధించాడు. కోచ్‌గానూ బాగా సక్సెస్ అయ్యారు. విదర్భ, కేరళ, గుజరాత్, బెంగాల్ దేశవాలీ జట్లకు హెడ్ కోచ్‌గా సేవలందించాడు.

అలాగే ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ తో పాటు రాజస్థాన్ జట్టుకు సుదీర్ఘంగా స్పిన్ బౌలింగ్ కోచ్‌గా పని చేశాడు. భారత క్రికెట్ అభివృదిలోనూ బహుతులే కీలక పాత్ర పోషించాడు. 2022  ఐసీసీ అండర్-19 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు బౌ లింగ్ కోచ్గా వ్యవహరించాడు. 2024 అండ ర్-19 ప్రపంచకప్‌లో కూడా కోచింగ్ సిబ్బందిలో సభ్యుడిగా ఉన్నాడు. అదనంగా ఇండి యా-ఏ, సీనియర్ జట్లతో పలు పర్యాయాలు ప్రత్యేక బౌలింగ్ కోచ్‌గా పని చేశాడు. భారత జట్టు స్పిన్ బౌలింగ్ కోచ్‌గా ఎంపిక కావడం గొప్ప గౌరవంగా భావిస్తున్నట్టు బహుతులే చెప్పాడు.