బీఆర్ఎస్ సర్పంచ్ లకు కృతజ్ఞతలు
15-12-2025 10:54 PM
మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి..
కొల్లాపూర్ రూరల్ (విజయక్రాంతి): స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు కల్పించిన ఇబ్బందులను ఎదుర్కొని ధైర్యంగా నిలబడిన బీఆర్ఎస్ కార్యకర్తలు, గెలుపొందిన సర్పంచ్ లకు కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. కొల్లాపూర్‌లోని తన క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల సమయంలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే రానున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధిస్తుందన్నారు.






