15-12-2025 10:51:14 PM
పెంట్లవెల్లి: ఇంటి నిర్మాణం చేపడుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు కాలుజారి కింద పడి తాపీ మేస్త్రి మృతిచెందిన సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండలం పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన బత్తిని వెంకటేష్(40) తాపీ మేస్త్రిగా పనిచేస్తున్నాడు. రోజులాగే సోమవారం మండల కేంద్రంలోని ఓ బిల్డింగ్ పైన పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడ్డాడు. వెంటనే కొల్లాపూర్ ఏరియా ఆసుపత్రికి తరలించగా మృతిచెందినట్లు తెలిపారు. భార్య సూరమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.