16-12-2025 12:00:00 AM
తలమడుగు, డిసెంబర్ 15 (విజయక్రాం తి): సాధారణంగా పంచాయతీ ఎన్నికలు అంటే భారీగా నామినేషన్‌లు దాఖలు కావడంలో, లేదంటే ఏకగ్రీవమో అవుతుంటాయి కానీ కొన్ని గ్రామాలు, వార్డులది విచిత్రమైన పరిస్థితి. ఆ పంచాయతీ పరిధిలో ఒక్కరు కూడ ఎస్టీ తెగవాళ్ళు లేకున్నా ఆ పంచాయతీ మాత్రం 19 ఏళ్లుగా ఎస్టీ గానే రిజర్వేషన్ కొనసాగుతూ వస్తుంది. దీంతో ఆ పంచాయతీకి సర్పంచ్ లేక ఉపసర్పంచే సర్పంచ్ గా కొనసాగుతు వస్తున్నారు. ఈ విచిత్రమైన పరిస్థితి నెలకొన్న ఆ పంచాయితీ ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలో ఉంది....
తలమడుగు మండలం రూయ్యడి గ్రామ పంచాయతీ జనాభా 2,470 అందులో 1,514 మంది ఓటర్లు ఉన్నారు. పంచాయతీ లో మొత్తం 10 వార్డులు ఉన్నాయి. అందులోను 5 ఎస్టీ రిజర్వేషన్ వార్డులే ఉన్నాయి. గ్రామపంచాయతీ ఎస్టీ రిజర్వేషన్ కావడంతో పోటీ చేసేందుకు ఎస్టీలు ఒక్కరు కూడా లేకపోవడంతో ఇక్కడ 19 ఏళ్ళుగా సర్పంచ్, ఉప సర్పంచ్ స్థానాలు కొలువు దీరడం లేదు. 5 వార్డులకు సైతం ఎన్నికలు జరగడం లేదు.
1981 నుంచి 1994 వరకు రుయ్యాడికి జనరల్ కేటగిరి సర్పంచ్ ఉండేవారు. 2000 సం వత్సరాలలు అప్పటి ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంతాల్లోని పంచాయతీలను ఎస్టీ రిజర్వేషన్ కిందికి చేర్చారు. దాంతో రుయ్యాడి పంచాయతీని ఎస్టీ జనరల్, ఎస్టీ మహిళలకు కేటా యిస్తున్నారు. అయితే ఇక్కడ ఒక గిరిజన ఓట ర్ లేకపోవడం గమనార్థం. ఇదే మండలంలోని సఖినాపూర్ నుంచి ఆత్రం యాదవ రావు, లక్ష్మి భాయ్ అనే గిరిజ న దంపతులు రుయ్యాడికి వలస వచ్చారు.
యాదవ్ రావే 2006 వరకు సర్పంచ్‌గా పని చేశారు. కాలక్రమేణ అనారోగ్యంతో యాదవ రావు దంప తులిద్దరూ మృతి చెందారు. అప్పటి నుండి గ్రామంలో గిరిజనులు లేకుండా అదే సామాజిక వర్గానికి సర్పంచ్, ఐదు వార్డు సభ్యులు పదవులను రిజర్వ్ చేస్తున్నారు. తమ పంచాయతీని జనరల్‌గా మార్చారని స్థానికులు కోరుతున్న పార్లమెంటులో చట్ట సవరణలు మాత్రమే మార్పు చేయడానికి అవ కాశం ఉందని అధికారులు చెప్తున్నారు.
రుయ్యాడి గ్రామపంచాయతీ రిజర్వేషన్ నోటిఫికేషన్ను సవాలు చేస్తూ గ్రామస్థులు తెలం గాణ హైకోర్టులో రిట్ దాఖలు చేశారు. గ్రామానికి చెందిన డాక్టర్ ఎల్చాల దత్తాత్రి తదితరులు దాఖలు చేసిన ఈ పిటిషన్లో, గ్రామంలో ఎలాంటి షెడ్యూల్ ట్రైబ్ (ఎస్.టి) జనాభా లేకపోయినా సర్పంచ్ పదవి సహా, ఐదు వార్డు స్థానాలను ఎస్టీ వర్గానికి రిజర్వ్ చేయడం చట్టబద్ధం కాదని పిటిషనర్ల తరఫున అడ్వకేట్ బూరా రమేష్ వాదనలు వినిపించారు.
ఎలాంటి భౌతిక పరిశీలన లేకుండా అధికారులు యాంత్రికంగా రిజర్వేషన్లు కేటాయించారని, ఇటువంటి నిర్ణయం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 21, 243-M(1), తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం2018, అలాగే జి.ఓ.ఎం.ఎస్. 46 (22-11-2025)లకు విరుద్ధమని అడ్వకేట్ వాదించారు. అర్హులులేని వర్గానికి రిజర్వేషన్ ఇవ్వడం ఎన్నికలను నామమాత్ర ప్రక్రియగా మార్చిందనీ తెలిపారు. వాదనలు విన్న జస్టిస్ టీ. మాధవి దేవి, రిట్ను నోటిస్ బీఫోర్ అడ్మిషన్ దశలో స్వీకరిస్తూ, రుయ్యాడి గ్రామపంచాయతీ ఎన్నికల ఫలితాలు పిటిషన్ తుది తీర్పుపై ఆధారపడతాయని ఆదేశించారు.
ప్రభుత్వ ప్లీడర్స్, రాష్ట్ర ఎన్నికల సంఘం, గ్రామ పంచాయతీ స్టాం డింగ్ కౌన్సిల్ నోటీసులు స్వీకరించి కౌంటర్ దాఖలుకు సమయం కోరారు. డిసెంబర్ 17, 2025న జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలను రుయ్యాడికి సంబంధించి తాత్కాలి కంగా నిలిపివేయాలని పిటిషనర్లు అభ్యర్థించారు. కేసు తదుపరి విచారణ కోసం జనవరి 5, 2026 తేదీ నిర్ణయించబడింది.
రిజర్వేషన్‌తో పంచాయతీ అభివృద్ధికి నష్టం...
రుయ్యాడి గ్రామ పంచాయతీ ఎస్టీగా రిజర్వ్ కావడంతో గ్రామంలో ఒక్క ఎస్టీ వ్యక్తి లేకపోవడంతో సర్పంచ్ పదవి, ఐదు వార్డు సభ్యులకు గత 19 ఏళ్లుగా ఎన్నికలు జరగడం లేదు. మిగతా ఐదు వార్డుల్లో గెలుపొందిన వారిలో నుండే ఒకరిని ఉప సర్పంచ్‌గా ఎన్నుకొని, ఆయననే సర్పంచ్‌గా కొనసాగీస్తూ వస్తున్నారు. దీంతో సర్పంచ్ లేక, ఐదుగురు వార్డు సభ్యులు లేక గ్రామంలో అభివృద్ధి కుంటుపడుతోంది. ఈ రిజర్వేషన్ విషయంలోనే హైకోర్టును ఆశ్రయించడం జరిగింది.
డాక్టర్ ఎల్చాల దత్తాత్రి