26 July, 2026 | 2:15 AM

వాస్తవం.. భ్రమ మధ్య ది మేజ్

26-07-2026 12:00 AM

తమిళ, తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందిన హీరో శ్రీరామ్ నటిస్తున్న కొత్త సినిమా ‘ది మేజ్’. శ్రౌష కమల ఆర్ట్స్, యూఆర్ క్రియేషన్స్ బ్యానర్లపై డాక్టర్ ఉదయ్ కే రెడ్డి పాల్వాయి, డాక్టర్ కేఎస్‌ఆర్, డాక్టర్ భరత్ రెడ్డి గోపు, డాక్టర్ అనిరుధ్ రెడ్డి సోమ నిర్మిస్తున్నారు. సైకలాజికల్ థ్రిల్లర్ కథతో దర్శకుడు డాక్టర్ రవికిరణ్ గడలాయ్ రూపొందిస్తున్నారు. ఇందులో ప్రియాంక, హృతిక శ్రీనివాస్, కమల్ కామరాజు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో లీడ్ యాక్టర్స్ ఇంటెన్స్ లుక్స్‌లో కనిపిస్తుండటం ఆసక్తి కలిగి స్తోంది. ఈ సందర్భంగా దర్శకుడు డాక్టర్ రవికిరణ్ గడలాయ్ మాట్లా డుతూ.. “వాస్తవోౌంభ్రమ మధ్య సరిహద్దులను చెరిపేస్తూ, ప్రతి క్షణం ప్రేక్షకులను సవాలు చేసే సైకలాజికల్ థ్రిల్లర్ ఇది” అన్నారు. ఈ చిత్రానికి డీవోపీ: శివకృష్ణ; సంగీ తం: శ్రావణ్ భరద్వాజ్; ఎడిటర్: సత్య గిడుతూరి; ఆర్ట్: రాజు అడ్డాల.